Begin typing your search above and press return to search.

చిన్నసినిమాకు వారంలోనే 100 కోట్లు

By:  Tupaki Desk   |   17 Nov 2019 10:32 AM GMT
చిన్నసినిమాకు వారంలోనే 100 కోట్లు
X
ఈమద్య కాలంలో కంటెంట్‌ ఉన్న సినిమాలకు కలెక్షన్స్‌ వసూళ్లు కురుస్తున్నాయి. మంచి కథ మరియు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటే సినిమా ఈజీగా ప్రేక్షకులకు రీచ్‌ అవ్వడంతో పాటు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో చిన్న బడ్జెట్‌ చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'బాలా' చిత్రం బాక్సాఫీస్‌ ను షేక్‌ చేస్తోంది. వారం రోజుల లోపులోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్‌ వర్గాల వారిని కూడా ఆశ్చర్య పర్చింది.

'బాలా'కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న 'ఉడ్జా చవాన్‌' సినిమా కంటెంట్‌ పరంగా బాలాతో పోటీ పడటంలో చతికిల్లపడిపోయింది. కేవలం పాతిక కోట్ల రూపాయలతో తెరకెక్కిన 'బాలా' చిత్రం ఇప్పటికే 110 కోట్లకు మించి వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం 160 నుండి 170 కోట్ల వరకు రీచ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ వారంలో కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడంతో బాలాకు మరో వారం కలిసి వస్తుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు.

ఇండియాలోనే 110 కోట్ల వరకు రాబట్టి విదేశాల్లో 50 కోట్ల వరకు ఈ చిత్రం దక్కించుకోవడం ఖాయం సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్మాన్‌ ఖురానా ఈ చిత్రంలో హీరోగా నటించగా భూమీ పడ్నేకర్‌ హీరోయిన్‌ గా నటించింది. ఈ చిత్రంలో హీరో బట్టతల సమస్యను పెద్ద సమస్యగా భావిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆయన బాధను మరియు బట్టతల వల్ల కలిగే కొన్ని సంఘటనలను సరదాగా చూపిస్తూ ఈ చిత్రంను తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంది.