Begin typing your search above and press return to search.

రోడ్ల‌పై తిరిగాను- అరుగుల‌పై ప‌డుకున్నాను: 'బ‌లగం' వేణు

By:  Tupaki Desk   |   14 March 2023 5:00 AM GMT
రోడ్ల‌పై తిరిగాను- అరుగుల‌పై ప‌డుకున్నాను: బ‌లగం వేణు
X
క‌మెడియ‌న్ వేణు పేరిప్పుడు ద‌ర్శ‌కుడిగా మారిమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క స‌క్సెస్ వేణు జీవితాన్నే మార్చేసింది. ఓ క‌మెడియ‌న్ ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అవ్వ‌డం అన్న‌ది టాలీవుడ్ లో ఇదే మొద‌టిసారి. దీంతో వేణు ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్ గా మారాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగానే స‌న్మానం అందుకున్నాడు? అంటే వేణు స‌క్సెస్ ఏ స్థాయిలో ఉంద‌న్న‌ది అద్దం ప‌డుతుంది.

ఇక‌పై క‌మెడియ‌న్ అనే ట్యాగ్ తొల‌గిపోయి 'బ‌లగం' ద‌ర్శ‌కుడు వేణు అని చిరస్థాయిగా నిలిచిపోతాడ న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడే రాజుగారు వేణు కి రెండ‌వ సినిమా ఛాన్స్ కూడా త‌న సొంత బ్యాన‌ర్లోనే క‌ల్పించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఇలాంటి ప్ర‌తిభావంతుల్ని గుర్తించి అవ‌కాశాలు ఇవ్వ‌డంలో ప‌రిశ్ర‌మ ముందుకొస్తుంది. ఇదంతా ఇప్పుడు మ‌రి వేణు గ‌తం లోకి వెళ్తే చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలే తెలుస్తున్నాయి.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాడు. చిన్న చిన్న పాత్ర‌లు పోషించి న‌టుడిగా మారాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'సినిమాల్లో న‌టించాల‌న్న‌దే నా ఆశయం. అందుకోసం ఎంతైనా శ్ర‌మించాల‌ని వ‌చ్చే ముందు బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకుని రంగంలోకి దిగాను. స‌క్సెస్ అవ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తోనే నాటి నుంచి నేటి వ‌ర‌కూ ప‌నిచేసాను.

ఈ క్ర‌మంలో బ్ర‌త‌కడం కోసం చాలా ప‌నులు చేసాను. 'చిత్రం' శ్రీను ద‌గ్గ‌ర రెండేళ్లు ట‌చ‌ప్ బాయ్ గా ప‌నిచేసాను. మేకప్ అసిస్టెంట్ గానూ ప‌నిచేసాను . సినిమా సెట్స్ కి సంబంధించిన ప‌నులు చేసేవాడిని. రోజుకి 70 రూపాయ‌లు కూలీ వ‌చ్చేది. అప్పుడు రూమ్ కూడా ఉండేది కాదు. రోడ్ల‌పై తిర‌గ‌డం..రాత్రైతే అరుగులు పై ప‌డుకునే వాడిని. అన్న‌దానాలు జ‌రిగ‌చే చోట తినేవాడిని. నాలాగే ఇంట్లోచి వ‌చ్చిన వాళ్లు చాలా మంది ఉండేవారు .అంతా ఓ చోట చేరి బ్యాచ్ గా చేరాం. సాయంత్ర అయ్యే సరికి ఎవ‌రెవ‌రు ఏ ఆఫీస్ చుట్టూ తిరిగే వారో చ‌ర్చించుకునే వాళ్లం. ఇలా చాలా కాలం పాటు ప‌రిశ్ర‌మ‌ని అంటిపెట్టుకుని ఉన్నాం. కొంద‌రు నిల‌బ‌డ్డారు. మరికొంత మంది తిరిగెళ్లిపోయారు' అని తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.