Begin typing your search above and press return to search.
సెంచరీపై బాలయ్య రిస్క్ చేస్తున్నాడా?
By: Tupaki Desk | 16 Jan 2016 7:00 AM GMT99 వ సినిమా డిక్టేటర్ తో హిట్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు వందో సినిమాకి రెడీ అయిపోతున్నాడు. తన కెరీర్ లో మైలురాయి అయిన సెంచరీ మూవీ కోసం బాలయ్య కసరత్తులు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్నాయి. తమ అభిమాన హీరో ఏ మూవీ చేస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా ఇలాంటి ల్యాండ్ మార్క్ మూవీస్ కోసం.. అందరూ సేఫ్ జోన్ లో వెళ్లేందుకు ట్రై చేస్తుంటారు. తమకు అంతకుముందే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో చేయాలని కోరుకుంటారు. కానీ బాలయ్య మాత్రం తన పంథాలోనే వెళ్లేందుకు రెడీ అయిపోతున్నట్లు అనిపిస్తోంది. 'మార్చి చివరి లోపు బోయపాటి కనుక ఫైనల్ స్క్రిప్ట్ తో రాకపోతే.. నేను సింగీతంతో సినిమా చేసేందుకు సిద్ధమవుతాను. ఇది ఆదిత్య 369 కి సీక్వెల్ కాగా.. ఇప్పటికి ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్ అనుకుంటున్నాం' అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బాలయ్య. తమ హీరోనుంచి ఈ మాట రాగానే ఫ్యాన్స్ లో కొంత ఆందోళన మొదలైంది. బోయపాటి ఇప్పటికే బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అతనికి బదులు.. పాతతరం డైరెక్టర్ తో సినిమా చేస్తాననడం, అది కూడా సోషియో ఫాంటసీ కావడంతో ఆందోళన చెందుతున్నారు.
మాస్ సినిమా చేసి, సేఫ్ గా సూపర్ హిట్ కొట్టేయడమే నయం అన్నది ఫ్యాన్స్ వాదన. అయితే.. బాలయ్య వందో సినిమాకి తనే డైరెక్షన్ వహించాలని బోయపాటి కూడా కోరుకుంటున్నా.. ప్రస్తుతం బన్నీతో చేస్తున్న సరైనోడు ఫినిషింగ్ స్టేజ్ లో ఉండడంతో.. పూర్తి స్థాయిలో బాలయ్య సబ్జెక్ట్ స్క్రిప్ట్ పై దృష్టిపై పెట్టలేకపోతున్నాడు బోయపాటి.