Begin typing your search above and press return to search.
బాలయ్య వందో సినిమా..కొన్ని కొత్త విషయాలు
By: Tupaki Desk | 20 Jan 2016 10:30 PM GMTఇక అనుమానాలే అవసరం లేదని... తాను చేయబోయే వందో సినిమా ఆదిత్య 999యే అని ఇటీవల డిక్టేటర్ సక్సెస్ మీట్ లో మరోసారి చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోనే ఆ చిత్రం తెరకెక్కబోతోంది. స్టోరీ బోర్డ్ తో సహా స్ర్కిప్టు పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాని పట్టాలెక్కించాలనుకొంటున్నాడట బాలకృష్ణ. ఆ మేరకు నిర్మాతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాడట.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ప్రాజెక్టుని కూడా ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థనే నిర్మించనున్నట్టు తెలిసింది. డిక్టేటర్ తో ఏరోస్ కి మంచి ఫలితాలే వచ్చాయి. తక్కువ బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేయడం, సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావడంతో ఏరోస్ సంస్థ బాలకృష్ణ వందో చిత్రాన్ని కూడా నిర్మించాలని డిసైడైయ్యిందట. కో ప్రొడ్యూసర్ గా డిక్టేటర్ ని తెరకెక్కించిన శ్రీవాసే వ్యవహరిస్తారని తెలిసింది. శ్రీవాస్ డిక్టేటర్ కి దర్శకత్వం వహించడంతో పాటు తన సొంత సొంస్థ వేదాశ్వ క్రియేషన్స్ తరఫున సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఏరోస్ కీ - శ్రీవాస్ కీ మంచి రిలేషన్ ఏర్పడటంతో బాలయ్య వందో సినిమాకి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలు కూడా చూడాలని ఆ సంస్థ శ్రీవాస్ ని కోరిందట. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్టు తెలిసింది. అలాగే బాలయ్య సరసన హీరోయిన్ గా కూడా అంజలి నటించబోతున్నట్టు సమాచారం. డిక్టేటర్ లో నటిస్తున్నప్పుడే తన వందో సినిమాలో కథానాయికగా ఆఫర్ ఇస్తానని అంజలికి బాలయ్య మాటిచ్చాడట. ఆ మేరకు ఆమెనే ఓకే చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు నందమూరి కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.