Begin typing your search above and press return to search.
#బాలయ్య101.. ఎలా చూసిన 10 లాభం
By: Tupaki Desk | 10 March 2017 8:18 AM GMTనందమూరి బాలకృష్ణ కొత్త సినిమా నిన్ననే ప్రారంభమైంది. ఎన్ బీ కే 101 గా ప్రారంభం జరుపుకున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ దర్శకుడు. అయితే.. మూవీ మొదలు పెట్టిన ఒక్క రోజులోనే.. ఈ చిత్రం లాభాల్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా మూవీకి నిర్ణయించిన బడ్జెట్ మహిమే అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత కాగా.. ఈ సినిమాకి మొత్తం 35 కోట్లు బడ్జెట్ కేటాయించారట. ఇందులో 10 కోట్ల రూపాయలు బాలయ్యకు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారు.
బాలయ్య కెరీర్ లో తొలిసారిగా 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకోవడం విశేషం. ఇక మిగిలిన 25 కోట్ల రూపాయల్లోనే పూరీ రెమ్యూనరేషన్ తో కలిపి సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బడ్జెట్ ఏమైనా ఎక్కువ అయితే మాత్రం.. అది పూరీ రెమ్యూనరేషన్ లోంచి తగ్గించుకోవాలనే కండిషన్ ఉందిట. పూరీకి ఓ 10 కోట్లు వేసుకున్నా 15 కోట్లతోనే మిగిలిన క్యాస్టింగ్.. మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో పూరీ దిట్ట అనే విషయం తెలిసిందే కానీ.. క్వాలిటీ పైనే కాసిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. 35 కోట్ల బడ్జెట్ అనే పాయింట్ మాత్రం కంప్లీట్ గా సేఫ్ జోన్ అని చెప్పాలి.
గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత.. బాలయ్య చిత్రాన్ని ఈజీగానే 40 కోట్లకు విక్రయించే అవకాశాలున్నాయి. మరోవైపు.. శాటిలైట్.. ఆడియో.. డిజిటల్ హక్కుల రూపంలో 10 కోట్ల రూపాయలు కనీసం వస్తాయి. ఈలెక్కన ఏ రకంగా చూసుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాతకు లాభదాయకమే అంటున్నారు. ప్రారంభమైన మరుసటి రోజే లాభాలు లెక్కేసుకునే అవకాశం రావడం అంటే.. దటీజ్ బాలయ్య అనాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/