Begin typing your search above and press return to search.
బాలయ్య సినిమా షూటింగంతా అక్కడేనా?
By: Tupaki Desk | 30 Jun 2017 5:44 AM GMTప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. దీని తర్వాత తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ‘జయసింహా’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘పైసా వసూల్’ను ఏప్రిల్లో మొదలుపెట్టి సెప్టెంబరు కల్లా విడుదలకు సిద్ధం చేస్తుండగా.. బాలయ్య తర్వాతి సినిమా విషయంలోనూ ఇదే స్పీడు చూపించబోతున్నారు. జులై 10న సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికల్లా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుందట. ఈ చిత్రానికి స్క్రిప్టు గత ఏడాదే పూర్తయింది. తర్వాత మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు రవికుమార్. బాలయ్య ఫ్రీ అయ్యే లోపు పక్కాగా షెడ్యూళ్లు వేసి.. ఆయన రాగానే శరవేగంగా సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ఫ్యాక్షన్ నాయకుడి పాత్ర పోషిస్తాడని అంటున్నారు.
ఐతే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ తమిళనాడులోనే చేయబోతున్నారట. రవికుమార్ తనకు సౌకర్యంగా ఉండేలా.. తన కథకు బాగా సరిపోతాయి అనుకున్న లొకేషన్లను తమిళనాడులోనే చూసుకున్నాడట. టెంపుల్ సిటీగా పేరున్న కుంభకోణంగా ఈ చిత్రం 40 రోజుల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకోబోతంది. ఐతే ఫ్యాక్షన్ కథలంటే రాయలసీమలో షూటింగ్ జరగడం సహజం. మరి తమిళనాడులో షూటింగ్ పెట్టుకున్నారంటే ‘సమర సింహారెడ్డి’ తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమైనా ఉంటుందేమో. దీంతో పాటుగా తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకట్రెండు షెడ్యూళ్లు ఉంటాయి. విదేశాల్లో పాటల చిత్రీకరణ ఉంటుంది. సి.కళ్యాణ్ నిర్మించబోయే ఈ చిత్రానికి నయనతారను కథానాయికగా అనుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/