Begin typing your search above and press return to search.
ఎన్ బీకే 105 జూన్ 12న ముహూర్తం
By: Tupaki Desk | 5 Jun 2019 10:20 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్న భారీ యాక్షన్ సినిమా డైలమా గురించి సంగతి తెలిసిందే. NBK105 వాస్తవానికి ఈ పాటికే ప్రారంభం కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. ఏడాది కాలంగా సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ఎన్ బీకే కోసం స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. కథలో ఎన్ బీకే సూచనల మేరకు మార్పు చేర్పులకు ఎక్కువ సమయం కేటాయించారు. ఇక ఎన్నికల ముందు ప్రారంభమవుతుందని వార్తలొచ్చాయి. కానీ కారణాంతరాల వల్ల వాయిదా పడింది. ఎన్నికల రిజల్ట్ అనంతరం ప్రారంభిస్తారని అభిమానుల్లో చర్చ సాగింది. అయితే ఈ సినిమాలో పొలిటికల్ నేపథ్యం.. ఓ యువనాయకుడిని విలన్ గా చూపించే ప్రయత్నం సాగుతోందని గుసగుసలు వినిపించాయి. అయితే ఎన్నికల రిజల్ట్ అనంతరం కథలో.. ఆ పాత్రలో మార్పు చేర్పులు చేయాల్సి వచ్చిందని ప్రచారం సాగింది.
ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ ప్రభావం సినిమాలో చూపించే కంటెంట్ పైనా పడిందని.. అందుకు తగ్గట్టు మార్పు చేర్పులు చేయాల్సి వచ్చిందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపించాయి. రాజకీయ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. అందువల్ల ఎప్పటికప్పుడు మారుతున్న ఇమేజ్ కి అనుగుణంగా పాత్రల్ని మార్చారని చెబుతున్నారు. ఎన్నికల రిజల్ట్ తేదేపాకు అనుకూలంగా రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను ఒకానొక దశలో మిడిల్ డ్రాప్ చేశారని కూడా పుకార్లు షికారు చేశాయి.
అయితే అన్నిటికీ చెక్ పెడుతూ ఈ సినిమాని ఈనెల 12న ప్రారంభించేందుకు ఎన్ బీకే బృందం సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జై సింహా తర్వాత మరోసారి బాలకృష్ణ- కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ రిపీటవుతోంది. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.