Begin typing your search above and press return to search.

సిగరెట్ కంటే చుట్ట మంచిది.. బాలయ్య వింత వాదన

By:  Tupaki Desk   |   12 Jan 2023 5:18 AM GMT
సిగరెట్ కంటే చుట్ట మంచిది.. బాలయ్య వింత వాదన
X
యంగ్‌ హీరోలు తమ ప్రతి సినిమాల్లో కూడా సిగరెట్లు తాగుతూ కనిపిస్తున్నారు. మ్యాన్లీగా కనిపించడం కోసం.. హీరోయిజం ను ఎలివేట్‌ చేయడం కోసం హీరోలు సిగరెట్లు తాగుతున్నారు. బాలకృష్ణ మాత్రం తన మెజార్టీ సినిమాల్లో చుట్టలు కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఎక్కువ శాతం బాలయ్య చుట్టలు కాల్చడమే సినిమాల్లో చూస్తాం.

సినిమాల్లోనే కాకుండా బాలకృష్ణ నిజ జీవితంలో కూడా చుట్ట కాల్చుతారట. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెళ్లడించాడు. సినిమాల్లో డైలాగ్స్‌ చెప్పే సమయంలో గారా రాకుండా ఉండాలి అంటే చుట్టు తాగాలని బాలకృష్ణ చెబుతున్నాడు. నాన్నగారు చుట్ట తాగేవారు.. నేను కూడా ఆయన్ను ఆనుసరించి ప్రతి రోజు కూడా చుట్ట తాగుతున్నట్లుగా పేర్కొన్నాడు.

ప్రతి రోజు ఉదయం తెల్లవారుజామున మూడున్నర గంటలకు లేచి చుట్ట కాలుస్తాను. ఒక అలావటుగా మారింది. చుట్ట కాల్చడం వల్ల వాయిస్ కు చాలా మంచిది. డ్రింక్ ను స్ట్రా వేసుకుని ఎలా తాగుతారో అలా చుట్ట పొగను కూడా లోనికి పీల్చుకోవాలి. అప్పుడు ఆ పొగ లంగ్స్ వరకు వెళ్లి వాటిపై ఉన్న శ్లేష్మం ను బయటకు లాక్కొచ్చేస్తుంది అన్నాడు.

సిగరెట్‌ పొగను పీల్చడం వల్ల ఆరోగ్యంకు హానికరం కానీ చుట్ట తాగడం వల్ల ఎక్కువ అనారోగ్యం కాదని కూడా బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్య చుట్ట సిద్ధాంతం ను కొందరు తప్పుబడుతూ ఉంటే మరి కొందరు మాత్రం నిజంగానే చుట్ట వల్ల ఇంత ప్రయోజనం ఉందా.. మేము ఇంత కాలం మిస్‌ అయ్యామా అన్నట్లుగా ఆలోచిస్తున్నారట.

నాటు పొగాకు చుట్టలను ఎక్కువగా ఇంతకు ముందు ఊర్లలో ఎక్కువ మంది తాగేవారు. కానీ ఇప్పుడు ఊర్లలో పెద్దమనుషులు కూడా సిగరెట్లను తాగుతున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఇంకా సాంప్రదాయ పద్దతిలో నాటు పొగాకుతో తయారు అవుతున్న చుట్టలను తాగడం విడ్డూరంగా ఉంది.

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే నేడు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమాకు ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు ఉంది. సినిమా ఫలితం పూర్తిగా క్లారిటీ రావాలంటే ఒకటి రెండు రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.