Begin typing your search above and press return to search.

బాలయ్య అంత రిస్క్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   19 March 2016 4:11 AM GMT
బాలయ్య అంత రిస్క్ చేస్తాడా?
X
నందమూరి బాలకృష్ణ చివరి సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్ పూర్తి చేసి దాదాపు మూడు నెలలవుతోంది. కానీ ఇంతవరకు ఆయన తర్వాతి సినిమా మీద జనాలకు క్లారిటీ లేదు. మామూలుగా అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ.. ఆయన చేయబోయేది తన వందో సినిమా కావడంతో దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. గత రెండు నెలల్లో బాలయ్య వంద సినిమా అంటూ రకరకాల ప్రాజెక్టులు తెరమీదికి వచ్చాయి. చివరగా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమపుత్ర శాతకర్ణి’ చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త ఊహాగానాలేమీ లేవు. దీనిపై ఈ రోజో రేపో.. బాలయ్య నోటి వెంటే అధికారిక ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.

బాలయ్య సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన క్రిష్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.. పూర్తి స్క్రిప్టు తయారు చేయమని చెప్పేసి.. ఆ సినిమా కోసం తన వంతుగా సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఇది చారిత్రక నేపథ్యంలో సాగే కథ కావడంతో కథానాయకుడు గుర్రపు స్వారీ చేయాల్సి ఉంటుందట. అందుకోసం హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడట నందమూరి హీరో. ఈ వయసులో గుర్రపు స్వారీ అంటే చిన్న విషయం కాదు. చిన్న వయసు నుంచే టచ్ ఉంటే ఓకే కానీ.. ఇప్పటికిప్పుడు సాధన అంటే మాత్రం కొంచెం కష్టమే. ఐతే బాలయ్యకు ఈ విషయంలో టచ్ లేకపోలేదు. ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య గుర్రం మీద దూసుకురావడం తెలిసిందే. ఐతే తన కొత్త సినిమా కోసం హార్స్ రైడింగ్ లో ఎంతో నైపుణ్యం సాధించాల్సి ఉండటంతో కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయి శిక్షణ తీసుకోబోతున్నాడట బాలయ్య. ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న పనే కానీ.. బాలయ్యకు అలాంటి సాహసాలు చేయడం కొత్తేం కాదు కదా.