Begin typing your search above and press return to search.

బాలయ్యా బోయపాటి - వాట్ టు డూ

By:  Tupaki Desk   |   27 Feb 2019 5:41 AM GMT
బాలయ్యా బోయపాటి - వాట్ టు డూ
X
ఒక్క పరాజయం ఎంత పెద్ద హీరోకైనా ఎలాంటి దర్శకుడికైనా భరించలేని ఒత్తిడి ఎలా తెస్తుందో చెప్పడానికి బాలకృష్ణ బోయపాటి శీనులు ఉదాహరణలుగా నిలుస్తున్నారు. వినయ విధేయ రామతో బోయపాటి శీను మీద వచ్చినన్ని విమర్శలు అతను ఇంతవరకు కెరీర్ లో ఎప్పుడూ అందుకోలేదు. ఇది చూసాక అప్పట్లో దుమ్మెత్తి పోసిన దమ్ము వంద రెట్లు నయం అనే దాకా పరిస్థితి వచ్చిందంటే జనం దీన్ని ఏ రేంజ్ లో తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ సబ్జెక్ట్ సెలక్షన్ కన్నా బోయపాటి టేకింగ్ మీదే విపరీతమైన కామెంట్స్ వచ్చాయి.

పైగా చరణ్ కొద్దిరోజుల తర్వాత అంచనాలు అందుకోలేనందుకు ప్రేక్షకులకు సారీ చెబుతూ ఓపెన్ లెటర్ రాయడం అందులో దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్టు బోయపాటి డ్యామేజ్ ని రెట్టింపు చేసింది. ఇదంతా తుడిచిపెట్టుకుపోవాలి అంటే మాములు హిట్ ఇస్తే సరిపోదు. బ్లాక్ బస్టర్ ని మించి అనే బొమ్మతో రావాలి

మరోపక్క బాలకృష్ణ భారీ అంచనాలు బడ్జెట్ తో నాన్నకు గొప్ప నివాళి ఇవ్వాలని తీసిన కథానాయకుడు మహానాయకుడు రెండూ మాములు దెబ్బ వేయలేదు. మార్కెట్ పరంగా కూడా బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసిందీ సినిమా. 50 కోట్లకు పైగా నష్టాలతో ఆయన వంద సినిమాల కెరీర్లో ఇదే పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీని ఫలితం చూసాక అభిమానుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందుకే బోయపాటి శీను బాలయ్య ఇద్దరికీ ఇది డూ ఆర్ డై సిచువేషన్.

బాలయ్యకు ఇది కాకపోయినా ఇంకో అవకాశం అందుకోగలడు. కాని శీను మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టే తీరాలి. అందుకే సింహ లెజెండ్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు దృష్టిలో ఉంచుకునే టైం తీసుకుని మరీ శీను స్క్రిప్ట్ ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది. వేసవి ముందు ప్రారంభం కాబోయే ఈ సినిమా కూడా ఈ కాంబోలో వచ్చిన సినిమాల మాదిరే మంచి యాక్షన్ మసాలానట