Begin typing your search above and press return to search.

'వీర సింహారెడ్డి' ఆ వివాదం నిజమేనా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 AM GMT
వీర సింహారెడ్డి ఆ వివాదం నిజమేనా?
X
ఒక సినిమాకు వందలాది మంది వర్క్‌ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఒకరికితో ఒకరికి పడక పోవడం.. చిన్న చిన్న క్రియేటివ్‌ డిఫరెన్స్ లు రావడం చాలా కామన్ విషయం. ఒక్కోసారి సినిమాలే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. చిన్న సినిమాల విషయంలో అలాంటివి జరుగుతాయి. కానీ పెద్ద సినిమాలకు ఎక్కువ బడ్జెట్‌ పెట్టడం వల్ల చిన్న చిన్న వివాదాలను పెద్దగా చేయకుండా ముందుకు సాగుతారు.

ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కు కూడా ఇలాంటి ఒక వివాదం జరిగిందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. షూటింగ్‌ సమయంలో కెమెరామెన్ రిషి పంజాబి యొక్క వర్క్‌ బాలయ్యకు నచ్చలేదని... తన యొక్క బాడీ లాంగ్వేజ్ ను రిషి సరిగా చూపించలేక పోతున్నాడని బాలకృష్ణ ఫీల్‌ అయ్యాడట. అందుకే తన గత సినిమాలకు వర్క్ చేసిన రామ్‌ ప్రసాద్‌ తో చాలా వరకు వీర సింహారెడ్డి యొక్క సన్నివేశాలకు సినిమాటోగ్రఫీ చేయించారట.

బాలయ్య చాలా కాలంగా రామ్‌ ప్రసాద్‌ తో వర్క్ చేస్తున్నాడు. ఆయన పనితనంకు అలవాటు పడ్డ బాలయ్య కు కొన్ని విషయాల్లో రిషి పంజాబీ యొక్క టేకింగ్‌ నచ్చినట్లుగా లేదు. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రిషి పంజాబీని తొలగించకుండా తన యొక్క కాంబో సన్నివేశాలను ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను రామ్‌ ప్రసాద్‌ యొక్క సినిమాటోగ్రఫీలో షూట్‌ చేశారంటూ ప్రచారం జరుగుతోంది.

దీన్నే కొందరు వివాదం అంటూ ప్రచారం చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే రిషి పంజాబీతో పాటు రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. కనుక ఇందులో వివాదం ఏముంది అంటూ బాలయ్య సన్నిహితులు మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వీర సింహారెడ్డి సినిమా ఔట్ పుట్‌ సరిగ్గా రావడం కోసం బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప రిషి పై వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వీర సింహారెడ్డి సినిమా ఏదో విధంగా గత వారం రోజులుగా మీడియాలో ఉంటూనే ఉంది. ఈనెల 12న రాబోతున్న ఈ సినిమా ముందు ముందు మరింత పబ్లిసిటీ చేయాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.