Begin typing your search above and press return to search.

గౌత‌మి ఓ పోరాట‌యోధురాలు: బాల‌య్య‌

By:  Tupaki Desk   |   27 Oct 2017 4:48 PM GMT
గౌత‌మి ఓ పోరాట‌యోధురాలు: బాల‌య్య‌
X
సినీ న‌టి గౌత‌మి కొన్ని సంవ‌త్స‌రాల క్రితం కేన్స‌ర్ బారిన ప‌డి కోలుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె ‘లైఫ్ ఎగైన్’ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను స్థాపించారు. కేన్స‌ర్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం - విరాళాలు సేక‌రించి కేన్స‌ర్ బాధితుల చికిత్సకు ఆర్థిక సాయమందించ‌డం వంటి ప‌నుల‌ను ఈ సంస్థ ద్వారా ఆమె నిర్వ‌హిస్తున్నారు. హైమా - మ‌ద్రాస్ టాకీస్ స‌హ నిర్మాత మాల లు ఈ సంస్థ‌కు స‌హ వ్య‌వ‌స్థాప‌కులుగా ఉన్నారు.

‘లైఫ్ ఎగైన్’ విశాఖపట్టణంలో రేపు ‘విన్నర్స్ వాక్’ పేరిట ఓ ర్యాలీని నిర్వహించనుంది. ఆ ర్యాలీలో ప్ర‌ముఖ సినీ న‌టుడు - హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొనబోతున్నారు. రేప‌టి కార్య‌క్ర‌మంపై మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌...గౌత‌మిపై ప్ర‌శంస‌లు కురిపించారు.

కేన్సర్ వ్యాధిపై ప్రజలకు అవ‌గాహ‌న కల్పించేందుకు విశాఖ‌లో రేపు చేప‌ట్టబోతున్న ర్యాలీకి ముఖ్య అతిథిగా బాల‌య్య హాజ‌రుకానున్నారు. కేన్సర్ మ‌హ‌మ్మారిని జ‌యించిన‌ గౌతమి నిజ‌మైన‌ పోరాటయోధురాలని బాలకృష్ణ ప్ర‌శంసించారు. భగవంతుడి ఆశీస్సులతోపాటు ఆమె పట్టుదల వల్ల కేన్స‌ర్ బారి నుంచి బయటపడ్డార‌ని అన్నారు. ‘ఐ డోంట్ సే షీ ఈజ్ ఎ సర్ వైవర్ బట్ ఎ ఫైటర్’ అని బాల‌య్య....గౌత‌మిని కొనియాడారు. కేన్సర్ వ్యాధి బారినపడ్డవారు మ‌నోధైర్యంతో ఉండాల‌ని సూచించారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, ‘లైఫ్ ఎగైన్’ సంస్థలు సంయుక్తంగా అనేక‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విశాఖలోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీ వరకూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు.