Begin typing your search above and press return to search.

నందమూరినందనవనవిహారి

By:  Tupaki Desk   |   3 Sep 2018 5:08 AM GMT
నందమూరినందనవనవిహారి
X
శ్రీ‌కృష్ణుడి ప్ర‌తిరూపం అన్న‌గారు ఎన్టీఆర్‌. గోవుల గోప‌న్న‌గా ఆయ‌న్ని త‌ప్ప ఇంకెవ‌రినీ ఊహించ‌లేం. సాక్షాత్తూ ఆ మ‌హావిష్ణువే శ్రీ‌కృష్ణుడిగా భువిపై ఆవిర్భ‌వించి, గోకులంలో య‌శోద‌మ్మ బిడ్డ‌గా జ‌న్మించి లోక‌క‌ళ్యాణానికి దారి చూపారు. అలాంటి క‌థ‌ల్ని ఎంచుకుని నాడు ద‌ర్శ‌కులు సినిమా తీసే ముందు ఊహించుకున్న రూపం న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్‌. అందుకే ఆయ‌న్ని త‌ప్ప ఆ త‌ర్వాత ఆ పాత్ర‌లో ఎంద‌రు న‌టించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అంత‌గా ఆ స్ఫుర‌ద్రూపం ప్రింట్ అయిపోయింది.

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ - అన్న‌గారు ఎన్టీఆర్‌ బ్రాండ్‌ ని ఇన్నాళ్టికి మ‌ళ్లీ ఎన్టీఆర్ వార‌సుడే అనుక‌రించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. పిల్ల‌న‌గ్రోవి చేత‌ప‌ట్టి - మెడలో ఆభ‌ర‌ణాలు ధ‌రించి.. శిర‌స్సున కిరీట‌ధారియై .. సూటిగా చూస్తున్న ఆ శ్రీ‌కృష్ణుని దివ్య రూపానికి న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అయితే ఎలా ఉంటారోన‌ని సందేహించిన వారికి ఇదిగో ఈ ఫోటో చూస్తే క్లారిటీ వ‌చ్చేస్తుంది. అన్న‌గారికి స‌రిరారెవ్వ‌రూ.. కానీ ఆయన వార‌సుడిగా బాల‌య్య‌బాబు ఆ ప్ర‌య‌త్నం చేయ‌డంపై నెటిజ‌నుల వ్యాఖ్య‌లు ఎలా ఉంటాయో చూడాలి.

అలాంటి రూపం మ‌ళ్లీ ఎవ‌రిలో చూడ‌గ‌లం? ఈ ప్ర‌శ్న‌కు ఇంత‌కాలం ఎన్నెన్నో సందేహాలు. కానీ, ఆయ‌న దివ్య‌రూపం ఆయ‌న లేని లోకంలో అభిమానులు చూడ‌గ‌లిగారా? ఎన్టీఆర్ వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఇదివ‌ర‌కూ అన్న‌గారిలా కాషాయంలో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన కాషాయ‌ధార‌ణ లుక్ చూసి - అన్న‌గారే బ‌తికొచ్చారా? అన్నంత‌గా ఒదిగిపోయి క‌నిపించారు బాల‌య్య‌. ఇప్పుడు శ్రీ‌కృష్ణుడిగా బాల‌య్య లుక్ చూశాక జ‌నం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడాలి. నేడు కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఈ కొత్త లుక్‌ ని `ఎన్టీఆర్‌` టీమ్ రిలీజ్ చేసింది. కృష్ణా.. ముకుందా... మురారీ... నందమూరి నందన వన విహారి... కృష్ణాష్టమి శుభాకాంక్షలు!! అంటూ టీమ్ విషెస్ చెప్పింది. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాల‌కృష్ణ‌తో క‌లిసి విష్ణు ఇందూరి - వారాహి చ‌ల‌న‌చిత్రం సాయికొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.