Begin typing your search above and press return to search.

బాలయ్య సెకండ్ వెర్షన్.. బ్లాస్ట్ అయ్యే ఫార్ములా!

By:  Tupaki Desk   |   11 Jun 2023 10:22 AM GMT
బాలయ్య సెకండ్ వెర్షన్.. బ్లాస్ట్ అయ్యే ఫార్ములా!
X
నందమూరి బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే బాలయ్య అంటే కచ్చితంగా గుర్తుకొచ్చే కొన్ని సినిమాలు మాత్రం ఉంటాయి. అందులో ఒకప్పుడు సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు కాని, తర్వాత చాలా ఏళ్ల తర్వాత వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ చిత్రాలలో బాలయ్యని తప్ప మరో హీరోని అస్సలు ఊహించుకోలేం కూడా.

అంతలా ఆ చిత్రాలలో బాలయ్య నటవిశ్వరూపం చూపించాడు. ఇవన్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలే కావడం విశేషం. అందుకే బాలయ్యని ఎక్కువగా యాక్షన్ హీరోగానే చూడటానికి అభిమానులు సైతం ఇష్టపడుతూ ఉంటారు. అయితే బాలయ్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలని ఓ సారి చూసుకుంటే సింహ, లెజెండ్, అఖండ, ఈ ఏడాదిలో వీరసింహారెడ్డి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది.

అదే పాత్రల ఎంపిక. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలలో బాలయ్య పాత్రలు అన్ని కూడా వయస్సుకి తగ్గ విధంగానే ఉంటాయి. ఎక్కడా కుర్ర హీరో తరహాలో హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే విధంగా ఉండవు. ఒక వేళ అలాంటి పాత్రలు ఉన్న వాటి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. బాలయ్యని యాక్షన్ హీరోగా నిలబెట్టిన పాత్రలు అన్ని కూడా ఆయన వయస్సుకి తగ్గ విధంగా ఉన్నవే.

అఖండలో అఘోరా పాత్రకాని, వీరసింహారెడ్డి పాత్ర గాని లెజెండ్ లో మెయిన్ లీడ్ చేసిన బాలయ్య పాత్ర కాని, సింహలో డాక్టర్ గా చేసిన పాత్ర అయిన అన్ని బాలయ్య వయస్సుకి యాప్ట్ అయ్యేవి కావడం విశేషం. ఈ పాత్రలే అతని ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. కుర్ర హీరోగా చేసిన సినిమాలు మాత్రం పెద్దగా కనెక్ట్ కాలేదు. దీంతో బాలయ్యని ఎలా చూడాలనేదానిపై ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఉందని చెప్పొచ్చు.

ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అలా బాలయ్య ఏజ్ కి తగ్గ పాత్రలోనే భగవంత్ కేసరిగా కనిపిస్తున్నాడు. ఇందులో శ్రీలీలకి తండ్రిగా బాలయ్య కనిపిస్తున్నాడు అంటే పాత్ర చిత్రణ ఎలా ఉండబోతోందనేది అర్ధమవుతోంది. బాలయ్య 2.ఓ వెర్షన్ ఇప్పుడు నడుస్తుందనే మాట టాలీవుడ్ లో ప్రచారంలోకి వచ్చింది. అతని హిట్ చిత్రాల సెంటిమెంట్ అలాగే కొనసాగితే కచ్చితంగా భగవంత కేసరి కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.