Begin typing your search above and press return to search.
బాలయ్య నిజాలు చెప్పలేరు ఎందుకంటే...!
By: Tupaki Desk | 17 Feb 2019 2:12 PM ISTక్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్' చిత్రం కంటే ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపైనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉందని కమెడియన్, వైకాపా నాయకుడు పృథ్వీ అన్నాడు. జనాలు చరిత్రను తెలుసుకోవాలనుకుంటున్నారు, అప్పట్లో ఏం జరిగిందో చెప్పే దమ్ము ధైర్యం కేవలం వర్మ గారికే ఉంది. అప్పటి విషయాలను వర్మ తన సినిమాలో చూపించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రం బాలయ్య ఆ పని చేయలేరు.
ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా చూపించాల్సి వస్తే చంద్రబాబు నాయుడు పాత్రను విలన్ గా చూపించాల్సి ఉంటుంది. అలా బాలకృష్ణ గారు చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్వయానా బాలకృష్ణ గారికి బావ అవ్వడంతో పాటు వియ్యంకుడు కూడా, అందుకే బాలకృష్ణ గారు నిజాలు చెప్పేందుకు సాహసం చేయరు అంటూ పృథ్వీ అన్నాడు. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు మరియు ఆయన చుట్టు ఉన్న వారు కూడా ఆయన్ను మోసం చేశారు.
వర్మ గారికి ఎవరిపై వ్యక్తిగత కక్ష లేదని, కేవలం చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ చిత్రాన్ని తీసినట్లుగా పృథ్వీ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానా గారితో చేయించి రాముడు మంచి బాలుడు అనిపించేలా ఆ పాత్రను తీర్చి దిద్దినట్లుగా అనిపిస్తుందని పృథ్వీ ఎద్దేవ చేశాడు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రెండు మూడు వారాల తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది.