Begin typing your search above and press return to search.
హెవీ స్పీడ్ డ్రైవింగ్ లోనూ ఆయన అఖండుడే!
By: Tupaki Desk | 13 Aug 2021 11:30 PM GMTఆన్ లొకేషన్ రియల్ స్టంట్స్ చేసే హీరోగా నటసింహా నందమూరి బాలకృష్ణకు గుర్తింపు ఉంది. ఆయన ఇంతకుముందు పలు చిత్రాల షూటింగుల్లో హార్స్ రైడింగ్ బైక్ రైడింగ్ వంటి డ్యాషింగ్ రియల్ ఫీట్స్ తో అలరించారు. అందుకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇక మోటార్ డ్రైవింగ్ లో బాలయ్య స్పీడ్ గురించి చెప్పేందుకు ఇదిగో ఈ వీడియో చూస్తే సరిపోతుంది.
బాలకృష్ణ హెవీ స్పీడ్ తో కార్ డ్రైవ్ చేస్తూ ఐబాల్స్ ని క్యాచ్ చేశారు. బాలకృష్ణ ఇటీవల తమిళనాడులో అఖండ కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు. సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణ చేశారు. మొత్తం టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం రెండు పాటలు ప్యాచ్ వర్క్ లు హైదరాబాద్ లో పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగానే బాలకృష్ణ చెన్నై నుండి హైదరాబాద్ కు కార్ లో బయల్దేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోని సునిశితంగా పరిశీలిస్తే.. కార్ స్టీరింగ్ యమ స్పీడ్ గా తిరుగుతోంది. స్టీరియోలో భక్తి పాట ప్లే అవుతుండగా ఇతరులతో తమిళంలో మాట్లాడుతూ బాలయ్య బాబు జోష్ మీద కనిపించారు. హైవేలో గంటకు 120-130 కిమీ వేగంతో ప్రయాణిస్తున్న వైనం బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ లో దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్లతో అఖండ హైప్ అమాంతం పెరిగింది. బిజినెస్ కూడా పెద్ద రేంజులోనే సాగుతోందని కథనాలొచ్చాయి. కరోనా క్రైసిస్ వల్ల ఈ చిత్రం కూడా రిలీజ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. తదుపరి గోపిచంద్ మలినేని.. అనీల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. తర్వాత ఆదిత్య 369 సీక్వెల్లో నటిస్తారు.