Begin typing your search above and press return to search.
బాలయ్య.. ఒక అమరావతి రాజు కథ
By: Tupaki Desk | 8 March 2016 8:18 AM GMTవామ్మో.. బాలయ్య 100వ సినిమా ఏంటో కాని.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా రేంజులో రకరకాల ట్విస్టులు ఇస్తున్నారు రోజూ. ఇప్పటివరకు బోయపాటి శ్రీను - సింగీతం శ్రీనివాసరావు - కృష్ణవంశీ పేర్లు మాత్రమే వినిపించాయిగా ఈ సినిమా కోసం.. ఇప్పుడు స్వయంగా బాలయ్య బాబే ఇంకో కొత్త కథను దర్శకుడిని తెరపైకి తెచ్చారు.
మ్యాటర్ ఏంటంటే.. అమరావతి నగరాన్ని ఎప్పుడో బిసి కాలంలో పాలించిన గౌతమీపుత్ర శ్వేతకర్ణి అనే రాజు ఉన్నాడట. ఆ రాజు కథను ఒక సినిమా రూపంలోకి తీసుకొచ్చి.. దానినే తన 100వ సినిమాగా తీయాలని అనుకుంటున్నాం అంటూ స్వయంగా వివరించాడు బాలయ్య బాబు. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఆయన వెల్లడించాడు. ఇప్పటికే రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా తొలి వెర్షన్ కు తొలి డైలాగులు కొన్ని రాస్తున్నారట. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తాడని తెలుస్తోంది.
ఏదేమైనా.. 100వ సినిమాపై ఒక్కోసారి ఒక్కోమాట బాలయ్యే చెప్తుండటం విశేషం. లెటజ్ సీ ఏమవుతుందో