Begin typing your search above and press return to search.

బాలయ్య అంటే అన్నాడు కానీ..

By:  Tupaki Desk   |   8 March 2016 5:30 PM GMT
బాలయ్య అంటే అన్నాడు కానీ..
X
మీరు పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు.. కానీ నేనేం చేసినా పబ్లిసిటీయే అనే ఈ మధ్య ఓ సినిమాలో బాలయ్య ఓ డైలాగ్ వేశాడు గుర్తుందా? ఈ డైలాగ్ సినిమా కోసం రాసిందే అయినా బాలయ్య నిజ జీవితానికి కూడా వర్తిస్తోంది. ఈ మధ్య బాలయ్య ఏం మాట్లాడినా.. ఏం చేసినా అది మీడియాలో పెద్ద చర్చనీయాంశమవుతోంది. లేటెస్టుగా సావిత్రి ఆడియో ఫంక్షన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని వల్ల బాలయ్యకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి కానీ.. ‘సావిత్రి’ సినిమాకు మాత్రం బాగానే మేలు జరిగింది.

నారా రోహిత్ - నందిత జంటగా నటిస్తున్న ‘సావిత్రి’ సినిమా గురించి జనాల్లో కొంత మంది వరకే తెలుసు. ఐతే బాలయ్య వ్యాఖ్యల తర్వాత ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. బాలయ్య మాటల గురించి ప్రస్తావిస్తూ ఇవి సావిత్రి సినిమా ఆడియో వేడుకలో చేసిన వ్యాఖ్యలు అంటూ వార్తల్లో ప్రస్తావిస్తున్నారు. ఇక బాలయ్య వ్యాఖ్యల గురించి మాట్లాడుకునేవాళ్లు కూడా.. ఇంతకీ బాలయ్య ఎక్కడ మాట్లాడాడు అన్న ఆరా తీసి.. ‘సావిత్రి’ సినిమా గురించి తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా ఆ సినిమా గురించి కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు ‘సావిత్రి’ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఆ సినిమా హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి బాలయ్య అంటే అన్నాడు కానీ.. ఆయన మాటల కారణంగా ‘సావిత్రి’ సినిమాకు మాత్రం మేలే జరిగింది.