Begin typing your search above and press return to search.
అలా అన్న బాలయ్యే...
By: Tupaki Desk | 24 May 2015 5:39 AM GMTవారం పది రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. బాలయ్య 99వ సినిమా ఖరారైంది. డిక్టేటర్ పేరుతో తన కొత్త సినిమా మొదలవబోతోందంటూ.. ఆ సినిమాకు సంబంధించిన విశేషాల్ని బాలయ్యే స్వయంగా వెల్లడించాడు. లైన్ మాత్రమే వినిపించారు.. మార్పులు సూచించాను.. కథ ఇంకా ఫైనల్ కాలేదు.. డిక్టేటర్ టైటిల్ కూడా ఖాయం కాదు.. అంటూ వారం కిందట 'డిక్టేటర్' టీమ్‌కు షాకుల మీద షాకులిచ్చిన బాలయ్యే నాటి మాటలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ 'డిక్టేటర్' సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. ఇంతకీ 'డిక్టేటర్' ప్రెస్‌నోట్‌లో బాలయ్య ఏమన్నాడో చూడండి.
''నా 99వ సినిమా డిక్టేటర్‌ను ఈ నెల 29 ప్రారంభించనున్నాం. డైరెక్టర్ శ్రీవాస్ నా దగ్గరకు మంచి కథతో వచ్చాడు. కథ విషయంలో నేను హండ్రెడ్ పర్సంట్ కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. కోన వెంకట్, గోపీమోహన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథను అందించారు. రత్నం, శ్రీధర్ సీపాన కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమాకు ఒక ఫ్రెష్ టీమ్‌తో పని చేస్తున్నా. ఒక ఫ్రెష్ ఫీల్ ఉన్న సినిమా ఇది. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్టైన్‌మెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో యునీక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నాడు బాలయ్య. అయినా పది రోజుల్లో 'డిక్టేటర్' విషయంలో బాలయ్యలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాని విషయం. దీన్ని బట్టే ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు రైటర్స్ కోన, గోపీలకు ఝలక్ ఇవ్వడానికి చేసినవని అర్థం చేసుకోవచ్చు.