Begin typing your search above and press return to search.

సెంచరీ కోసం బాలయ్య టైం మెషీన్

By:  Tupaki Desk   |   18 Jan 2016 7:12 AM GMT
సెంచరీ కోసం బాలయ్య టైం మెషీన్
X
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా ఏది? ఈ ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఎలాంటి స్క్రిప్ట్ ని ఎంచుకోబోతున్నారు? సేఫ్ గా కమర్షియల్ మూవీ చేసుకుంటారా? రిస్క్ అయినా తనకు అలవాటైన ప్రయోగాలు చేస్తారా? ఇవన్నీ ఇప్పటివరకూ ప్రశ్నలే కానీ.. ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది.

బాలయ్య బాబు తన వందో సినిమాగా ఆదిత్య 369కి సీక్వెల్ చేయబోతున్నట్లు చెప్పేశారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిశారు బాలకృష్ణ. ఈ సందర్భంగా.. తన 99వ మూవీ డిక్టేటర్ మూవీ చూడాలని కేసీఆర్ ని ఆహ్వానించగా, వందో సినిమాగా ఏ మూవీ చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆదిత్య 369 సీక్వెల్ చేయబోతున్నట్లు కేసీఆర్ కి బాలకృష్ణ చెప్పారు. ఏకంగా ముఖ్యమంత్రికి చెప్పిన వార్త కావడంతో.. ఇప్పుడిది అధికారిక వార్త అయిపోయింది. నిజానికి ఆదిత్య 369 సీక్వెల్ కి మొత్తం స్టోరీ, స్క్రిప్ట్ అంతా సిద్ధంగా ఉంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సీక్వెల్ చేసేందుకు బాలయ్య కూడా సిద్ధంగానే ఉన్నారు.

తనకు సింహ - లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో, బోయపాటి వైపు కూడా మొగ్గారు. కానీ ఇలాంటి ల్యాండ్ మార్క్ సినిమాని విభిన్నమైన కాన్సెప్ట్ తోనే చేసేందుకు బాలయ్య చివరకు మొగ్గారని అర్ధమవుతోంది. ఈ సినిమాకి ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు.. డిక్టేటర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాలయ్య చెప్పారు.