Begin typing your search above and press return to search.

బాల‌య్య క్ర‌ష్ ర‌ష్మిక‌..మ‌రి ర‌ష్మిక‌?

By:  Tupaki Desk   |   16 Oct 2022 10:30 AM GMT
బాల‌య్య క్ర‌ష్  ర‌ష్మిక‌..మ‌రి ర‌ష్మిక‌?
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ ముక్కుసూటి త‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏదైనా అయ‌న ద‌గ్గ‌ర అంతా ఓపెన్. ఓపెన్ హార్ట్ తో మాట్లాడే ఏకైక హీరో బాల‌య్య‌. విష‌యం ఏదైనా దాప‌రికాలు..ఢొంక తిరుగు లేకుండా మాట్లాడ‌టం ఆయ‌న నైజం. బాల‌య్య ఇలా ఉండ‌టం అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు తెచ్చిపెట్టినా? అవి రాజ‌కీయంగా వ్య‌తిరేక‌త‌ను తీసుకొచ్చాయ్.. త‌ప్ప ఇండస్ర్టీకి అవెప్పుస స‌ర‌దాగానే ఉంటాయి.

బాల‌య్య వ్య‌క్తిత్వం..ఆయ‌న మంచి మ‌న‌సు ప‌రిశ్ర‌మ‌కి తెలుసు కాబ‌ట్టి పెద్ద‌గా నెగిటివ్ కాలేదు. ఇక ఆహా లో అన్ స్టాప‌బుల్ కి హో స్ట్ గా మారిన ద‌గ్గ‌ర నుంచి బాల‌య్య లో చ‌లాకీత‌నం రెట్టింపు అయింది. షో బాల‌య్య‌ని పూర్తిగా మార్చేన‌సింది. బుల్లి తెర‌పైకి స‌రికొత్త బాల‌య్య‌ని చూపిస్తున్నారు. తాజాగా అన్ స్టాప‌బుల్ -2 షో వేదిక‌గా బాల‌య్య‌ని ఇప్ప‌ట్లో మీ క్ర‌ష్ ఏ హీరోయిన్ పై అంటే? వెంట‌నే ఆయ‌న ర‌ష్మిక మంద‌న్న పేరు చెప్పారు. ప్ర‌తిగా బాల‌య్య మ‌రి నీది అని యంగ్ హీరో సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌ని అడ‌గా కియారా అద్వానీ అంటాడు.

దీనికి వెంట‌నే బాల‌య్య షూటింగ్ లేక‌పోయిననా? అంటూ న‌వ్వేస్తారు. ప‌క్క‌నే ఉన్నా విశ్వ‌క్ సేన్ ని మాత్రం ఇందులోకి లాగ‌లేదు. ఇలాంటి ఎన్నో విష‌యాలు అన్ స్టాప‌బుల్ -2 రెండ‌వ ఎపిసోడ్ లో కనిస్తాయి. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన ప్రోమో వైర‌ల్ అవుతోంది. ఆ సంగ‌తి పక్క‌న‌బెడితే బాలయ్య క్ర‌ష్ ర‌ష్మిక‌..మ‌రి ర‌ష్మిక క్ర‌ష్ ఏ హీరో? అన్న‌ది తెలియాలి సుమీ.

ఈ భామ‌ యంగ్ హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌తో స‌న్నిహితంగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.రీసెంట్ గా జంటగా మాల్దీవుల్లోనూ క‌నిపించారు. దీంతో ఆ వార్త‌లు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. మ‌రి ఇది ప్రెండ్ షిప్ నా? అంత‌కు మించి ఇకేదైనా ఉందా? అన్న‌ది తెలియాలి. ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం వెళ్లిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. కానీ ఈ జంట మాత్రం ఇంతవ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ జంట‌పై కూడా బాల‌య్య ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే స‌రి. అన్ స్టాప‌బుల్ -2 రేటింగ్ మారిపోతుంది.