Begin typing your search above and press return to search.
అన్ స్టాపబుల్ : బాలయ్య కూతురు పవన్ కి ఫ్యాన్?
By: Tupaki Desk | 28 Dec 2022 5:29 AM GMTనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెల్సిందే. నిన్న షో యొక్క చిత్రీకరణ జరిగింది. ఈ సీజన్ యొక్క చివరి ఎపిసోడ్ గా ఆహా వారు ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.
ఇక పవన్ హాజరు అయిన అన్ స్టాపబుల్ షో కు సంబంధించిన పలు విషయాలు మరియు ఫొటోలు సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యాయి. కొందరు అక్కడ హాజరు అయిన వారు వీడియో లు మరియు ఫొటోలను షేర్ చేయగా.. కొందరు ఇలా జరిగింది.. ఇది జరిగింది అంటూ ఊహిస్తూ కథనాలు అల్లేస్తున్నారు.
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ షో లో బాలయ్య స్టైలింగ్ విషయమై బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ షో కు మాత్రమే కాకుండా బాలయ్య నటిస్తున్న సినిమాలకు మరియు ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరు అయిన సమయంలో తేజస్విని ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటుంది.
కానీ కొందరు మాత్రం తేజస్విని కేవలం పవన్ హాజరు అయిన ఎపిసోడ్ కోసం వచ్చిందని.. పవన్ కి ఆమె అభిమాని అవ్వడం వల్ల ఆయన్ను కలిసేందుకు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు అల్లుతున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే సీజన్ 1 నుండి కూడా అన్ స్టాపబుల్ షో కోసం తేజస్విని స్టైలింగ్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంది. ఆమె ఆధ్వర్యంలో బాలయ్య న్యూ లుక్ లో అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. ప్రతి ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో కూడా తేజస్విని అన్ స్టాపబుల్ సెట్ లో ఉంటారు. కనుక ఆమె పవన్ ఎపిసోడ్ కు ప్రత్యేకంగా వచ్చారు అనే వార్తల్లో నిజం లేదు. ఈ విషయమై ఇంకా పుకార్లు.. పులిహోర వార్తలు ఆపేస్తే బాగుంటుందని పవన్.. బాలయ్య అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.