Begin typing your search above and press return to search.

బాల‌య్య డైలాగులు అదిరిపోయాయంతే!

By:  Tupaki Desk   |   21 Dec 2015 3:49 AM GMT
బాల‌య్య డైలాగులు అదిరిపోయాయంతే!
X
బాల‌కృష్ణ సినిమా అన‌గానే అంద‌రికీ గుర్తుకొచ్చేవి డైలాగులే. మాట‌ల్ని తూటాల్లాగా పేలుస్తూ బాల‌య్య చెప్పే సంభాష‌ణ‌ల‌కి మంచి క్రేజ్ ఉంది. అభిమానులైతే వాటి గురించి చెప్పుకొని చెప్పుకొని సంబ‌ర‌ప‌డిపోతుంటారు. ఆ విష‌యాన్ని గుర్తించే త‌న సినిమాల్లో ప‌వ‌ర్‌ ఫుల్ డైలాగులు ఉండేలా చూసుకుంటుంటారు బాల‌కృష్ణ‌. డిక్టేట‌ర్‌ లోనూ బాల‌య్య శైలి సంభాష‌ణ‌లు బోలెడ‌న్ని ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. నిన్న రాత్రి జ‌రిగిన ఆడియో వేడుక‌లోనే బాల‌య్య నాలుగైదు సంభాష‌ణ‌లు చెప్పి అభిమానుల్ని ఉర్రూత‌లూగించాడు. అన్న‌ట్టు బాల‌కృష్ణ చెప్పిన ఆ డైలాగులో ఒక‌టి అభిమాని పంపించింది కూడా ఉంది. త‌న నోటి నుంచి ఎలాంటి సంభాష‌ణ‌లు వ‌స్తే బాగుంటుందో అభిమానుల‌కి బాగా తెలుసనీ, అందుకే ఓ అభిమాని పంపిన డైలాగుని య‌థాత‌థంగా వాడామ‌ని బాల‌య్య చెప్పాడు.

`ప‌ర్వ‌తం ఎక్కు ఫ‌ర్వాలేదు... ఎత్తాల‌ని చూడ‌కు, పైకిపోతావ్‌...`, `నా పేరు ధ‌ర్మ నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేట‌ర్‌. నీ చావు చూడాలంటే దాన్ని ట‌చ్ చేసి చూడు... `, `మీరు ఏం చేసినా ప‌బ్లిసిటీ చేస్తారు. కానీ నేను ఏం చేసినా అది ప‌బ్లిసిటీ అవుతుంది`, `దాహం వేస్తే సింహం కూడా త‌ల‌దించుకొనే నీళ్లు తాగుతుంది. అంత మాత్రాన త‌ల‌దించుకుంద‌ని తొడ‌గొట్ట‌కు. కొట్ట‌డానికి తొడ ఉండ‌దు, ఎత్త‌డానికి త‌లా ఉండ‌దు`. - ఇలాంటి డైలాగుల‌న్నీ ఆడియో వేడుక‌లో చెప్పి `డిక్టేట‌ర్‌`లో సంభాష‌ణ‌ల ప‌ర్వం ఎలా ఉందో మ‌చ్చుకు కొంచెం రుచి చూపించారు బాల‌య్య‌. ఇలాంటివి ఇంకా సినిమాలో బోలెడ‌న్ని ఉన్నాయ‌ట‌. అయితే ఈ సంభాష‌ణ‌ల్లో కొట్ట‌డానికి తొడ ఉండ‌దు అన్న మాట ఎక్కువ‌గా తొడ గొట్టే క‌థానాయ‌కుల్ని ఉద్దేశించిన‌దే అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.