Begin typing your search above and press return to search.
బాబాయ్ కి మూడు.. అబ్బాయికి ఒకటే
By: Tupaki Desk | 22 April 2016 5:30 PM GMTఈ ఏప్రిల్ 22న నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు రెండు పండుగలు. ఒకటి బాలయ్య నటించిన పొంగల్ మూవీ డిక్టేటర్ వంద రోజుల పండుగ చేసుకోవడం అయితే.. బాలయ్య వందో సినిమా స్టార్ట్ కావడం రెండోది. ఇవాల్టితే డిక్టేటర్ చిత్రం శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంటోంది.
డిక్టేటర్ చిత్రం నేరుగా మూడు సెంటర్లలో వంద రోజులు ఆడ్డం విశేషం. అసలు హండ్రెడ్ డేస్ అనే మాటే వినిపించని ఈ రోజుల్లో.. మూడు సెంటర్లయినా చాలా ఎక్కువ అనాల్సిందే. ఎందుకంటే.. సంక్రాంతి రిలీజ్ సమయంలో ఈ చిత్రాన్ని సక్సెస్ అన్నా.. ఆ తర్వాత ఫుల్ కలెక్షన్స్ వచ్చాక ఫ్లాప్ అని తేల్చేశారు ట్రేడ్ పండిట్స్. పెట్టుబడిని పూర్తిగా రికవర్ చేయలేకపోవడమే ఇందుకు కారణం.
అయితే హిట్ అనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో మాత్రం ఒకే ఒక్క సెంటర్ లో వంద రోజులు ఆడింది. అంటే.. బాలయ్య ఫ్లాప్ చిత్రం కంటే.. జూనియర్ హిట్ మూవీకి సెంటర్స్ తక్కువ పడ్డాయి. తక్కువ సెంటర్లలో రిలీజ్ కారణంగా ఇలా డిక్టేటర్ ని ఫ్లాప్ కోటాలో చేర్చాల్సి వచ్చింది కానీ.. సంక్రాంతికి సమయంలో మరిన్ని థియేటర్లు లభించి ఉంటే.. బ్లాక్ బస్టర్ అయ్యేదంటారు బాలయ్య ఫ్యాన్స్.