Begin typing your search above and press return to search.

బాలయ్యా.. ఆ డైలాగ్ జగన్ గురించేనా?

By:  Tupaki Desk   |   23 Dec 2015 11:30 AM GMT
బాలయ్యా.. ఆ డైలాగ్ జగన్ గురించేనా?
X
బాలయ్య మరోసారి వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. తన సినిమాల్లో వీలు చిక్కినపుడల్లా వైఎస్ ను, జగన్ ను లక్ష్యంగా చేసుకుని డైలాగులు పేల్చే బాలయ్య తన కొత్త సినిమా ‘డిక్టేటర్’లో డోస్ మరింత పెంచినట్లే ఉన్నారు. ట్రైలర్ లో వినిపిస్తున్న ఓ డైలాగ్ జగన్ ను ఉద్దేశించే అని ఎవర్నడిగినా చెప్పేస్తారు. ''అహంకారం ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఏరోజుకైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే''.. ఇదీ ట్రైలర్ లో బాలయ్య పలికిన డైలాగ్. అహంకారం ఉన్న ఆడది అంటే రోజా అని.. అవినీతిలో ఉన్న మగాడు అంటే జగనే అని జనాలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. సినిమాలో ఇలాంటి డైలాగులు మరిన్ని ఉంటాయని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాల్లో పొలిటికల్ పంచ్ డైలాగులు బాగా ఉంటున్నాయి. జగన్ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన గాలి జనార్దనరెడ్డిని టార్గెట్ చేస్తూ.. ‘లయన్’ సినిమాలో ‘ధూళి’ అనే క్యారెక్టర్ పెట్టడం.. అంతకుముందు ‘అధినాయకుడు’లో విగ్రహ రాజకీయాలు చేస్తున్నావా అంటూ జగన్ ను టార్గెట్ చేసి డైలాగులు పలకడం.. శ్రీమన్నారాయణ - లెజెండ్ సినిమాల్లోనూ కొన్ని పొలిటికల్ పంచ్ లు విసరడం తెలిసిందే. అందులోనూ ఇప్పుడు బాలయ్య ఎమ్మెల్యే కూడా కావడంతో దూకుడు మరింత పెరిగింది. పొలిటికల్ రెఫరెన్సులూ ఎక్కువయ్యాయి. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో విన్న డైలాగుల కంటే కూడా ‘డిక్టేటర్’లో పొలిటికల్ పంచ్ లు భారీగా ఉంటాయని సమాచారం.