Begin typing your search above and press return to search.

15 పర్సెంట్.. బాలయ్య సంక్రాంతి ఆఫర్..

By:  Tupaki Desk   |   13 Jan 2016 12:14 PM GMT
15 పర్సెంట్.. బాలయ్య సంక్రాంతి ఆఫర్..
X
డిక్టేటర్ మూవీ డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకు అనూహ్యంగా ఆఫర్ వచ్చింది. ముందుగా చేసుకున్న ఒప్పందంలో.. 15 శాతం డిస్కౌంట్ ఇస్తూ బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ శ్రీవాస్.. భాగస్వామ్య నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తో సంప్రదింపులు చేసి మరీ.. అనౌన్స్ చేశాడు.

ఇలా రిలీజ్ కు ముందే పదిహేను శాతం డిస్కౌంట్ అంటే చాలా పెద్ద మొత్తం అవుతుంది. దాదాపు 3 నుంచి 4 కోట్ల మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు అదనంగా మిగులుతుందన్న మాట. డిక్టేటర్ పై పెట్టుబడులకు అప్పుడే రిటర్నులు కనిపించడం ఖాయమైందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమా హిట్ అనిపించుకుంటే చాలు.. అందరికీ భారీ లాభాలు మిగులుతాయనే అంచనాలు ఉన్నాయి.దీంతో బాలయ్యకు నిర్మాతలకు బోలెడు థ్యాంక్స్ చెబుతున్నారు కొనుగోలుదారులు. సాధారణంగా తన సినిమాలు పంపిణీ చేసేవారిపై చాలా ఉదారంగా ప్రవర్తిస్తారని బాలయ్యకు పేరుంది. ఇప్పుడా విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారాయన.

మరికొన్ని గంటల్లోనే డిక్టేటర్ తెరపై సందడి చేయనుంది. మూవీలో ఇతర పార్టీల లీడర్స్ పై కామెంట్స్ ఉన్నాయనే టాక్ వినిపిస్తున్నా.. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని కొట్టిపడేశారు బాలయ్య. అంజలి, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటించిన డిక్టేటర్.. బాలకృష్ణకు 99వ సినిమా కావడం విశేషం.