Begin typing your search above and press return to search.
బాలయ్యను గణేషుడు కరుణిస్తాడా?
By: Tupaki Desk | 14 Sep 2015 11:30 AM GMTబాలయ్యబాబు ప్రస్తుతం కెరీర్ 99వ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిక్టేటర్ ప్రస్తుతం యూరప్ షెడ్యూల్ లో బిజీ. అయితే ఈ సినిమా ప్రమోషన్‌ని రొటీన్ కి భిన్నంగా ప్రారంభించాలని సినిమా యూనిట్ భావించింది. కానీ అందుకు ఆదిలోనే హంసపాదు అన్న చందంగా తయారైంది పరిస్థితి. వివరాల్లోకి డీప్ గా వెళితే..
బాలయ్య డిక్టేటర్ ప్రమోషన్ ని వినాయకుని ఆశీస్సులతో ప్రారంభిస్తున్నాం. ఈనెల 17న వినాయక చవితి కానుకగా టీజర్ తో పాటు జై గణేశ సాంగ్ ని రిలీజ్ చేస్తామని రైటర్ కోన వెంకట్ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. పైగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుని చెంత ఈ టీజర్ ని ఆవిష్కరిస్తామని చెప్పారాయన. దీంతో ఇటు బాలయ్య అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెరిగింది. నిజంగానే ఆ పని చేస్తారా? అన్న క్యూరియాసిటీ పెరిగింది. ఖైరతాబాద్ గణేషుడికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతియేటా వినాయక చవితికి ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది. అంటే ప్రమోషన్ అదిరిపోతుందని అంతా అంచనాలేశారు. కానీ దీనికి ఉత్సవ కమిటీ అంగీకరిస్తుందా? అన్న సందేహాలొచ్చాయి.
కమిటీ కార్యదర్శిని చెప్పిన దాని ప్రకారం ఇక్కడ డిక్టేటర్ ప్రమోషన్ కుదరదనే అంటున్నారు. డివోషన్ ప్లేసు లో ఇలా సినిమా ప్రచారమేంటి? అన్న ప్రశ్న తలెత్తిందని చెబుతున్నారు. కమిటీని ఇప్పటికే డిక్టేటర్ టీమ్ సంప్రదించింది. అయితే ఇక్కడ కేవలం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని మాత్రమే చెప్పారు. పాటలు లాంచ్ చేస్తాం. టీజర్ లాంచ్ చేస్తామని మాతో చెప్పలేదు. ప్రమోషన్ కి అంగీకారం వస్తుందా? లేదా? అన్నది నేను చెప్పలేను అంటూ కమిటీ మెంబర్ వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ డిక్టేటర్ కి వినాయకుని ఆశీస్సులు దక్కుతాయా ? లేదా? ఈ సినిమాలని వినాయకుడిపై పాటను ఇక్కడ లాంచ్ చేస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ.!