Begin typing your search above and press return to search.

బాలయ్యతో హాటీ డిన్నర్ కు వెళ్ళిందే

By:  Tupaki Desk   |   27 July 2017 5:06 PM GMT
బాలయ్యతో హాటీ డిన్నర్ కు వెళ్ళిందే
X
మనం ఆల్రెడీ చెప్పినట్లు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ జపం చేస్తోంది ఐటెం గాళ్ కైరా దత్. ఆల్రెడీ బాలయ్య తనకు డైలాగులు నేర్పడం వలనే తెలుగు బాగా మాట్లాడానని ఈ బెంగాళీ సుందరి చెప్పింది. కేవలం ''పైసా వసూల్'' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందనుకుంటే అమ్మడు ఏకంగా కొన్ని సీన్లలో కూడా నటించేసిందట. అయితే ఇప్పుడు బాలయ్యతో ఈమె సరదాగా టైమ్ స్పెండ్ చేయాడం టాక్ ఆఫ్‌ ది టౌన్ అయ్యింది.

మరి షూటింగ్ పూర్తి కావడంతో బాలయ్యే ఈమెను డిన్నర్ డేటుకు పిలిచారా లేదంటే తనకు ఇంత మాంచి ఆఫర్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈమే స్వయంగా బాలయ్యను డిన్నర్ డేటుకు తీసుకెళ్లిందా తెలియదు కాని.. ఇప్పుడు బాలయ్య తో కలసి డిన్నర్ చేస్తోంది కైరా దత్. బాలయ్య మనస్సు బంగారమని.. అలాంటి వ్యక్తితో కలసి పనిచేయడం తన అదృష్టమని.. షూటింగ్ పూర్తయిన సందర్భంగా తాను ఆయనతో ఇలా డేట్ కు వచ్చానని మాత్రం తెలిపింది కైరా. ఏదేమైనా కూడా బాలయ్య బాండింగ్ అదరహో అనే చెప్పాలి.

ఈ సినిమా విషయంలోనే కాదు.. ఆయనతో పనిచేసిన ప్రతీ హీరోయిన్ ఆయన గురించి ఇలాగే చెబుతారు. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం ఆయనకు బహుశా తండ్రి దగ్గర నుండి వచ్చిన ఒక సుగుణం. అయితే ఆయన్ను చూసి ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలు ఈ కోణాన్ని కాస్త వంటబట్టించుకుంటే మంచిది అంటూ ఇండస్ర్టీ వాసులు చెబుతున్నారు.