Begin typing your search above and press return to search.
రెండు పాత్రల్లో బాలయ్య?
By: Tupaki Desk | 10 April 2016 4:17 AM GMTపాత్రల మధ్య వేరియేషన్స్ చూపించడంలో బాలకృష్ణకి తిరుగులేదు. ఆయన ద్విపాత్రాభియనం చేసిన సినిమాలు బోలెడన్ని. కొన్ని సినిమాల్లో మూడు పాత్రల్లోనూ కనిపించి అలరించారు. తాజాగా మరోసారి బాలయ్య రెండు పాత్రల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తన వందో చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణిలో బాలయ్య ద్విపాత్రాభియనం చేస్తున్నట్టు తాజా సమాచారం. రెండు పాత్రలకీ - బాలయ్యకీ బాగా అచ్చొచ్చింది. తెరపై అలా కనిపించిన ప్రతీసారీ ఆయనకి హిట్టొచ్చింది. వందో సినిమాకీ ఆ సెంటిమెంట్ కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది రోజున గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో టైటిల్ రోల్ కోసం మీసకట్టు పెంచుతూ బాలయ్య ఇప్పటికే సిద్ధమవుతున్నాడు. అయితే సినిమాలో అదనంగా మరో గెటప్ కూడా ఉంటుందట. దీన్నిబట్టి బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తున్నట్టు అర్థమవుతోంది.
తెరపైన హిస్టరీ చెప్పడంలో క్రిష్ కి ఎంత పట్టుందో కంచెతోనే తెలిసొచ్చింది. రెండో ప్రపంచకాలం నాటి పరిస్థితుల్నీ - వర్తమాన కాలాన్నీ ఆయన చూపించిన విధానం ఆకట్టుకుంది. అలా గౌతమీ పుత్ర శాతకర్ణి కథని కూడా వర్తమానంతో ముడిపెట్టి చూపించేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అలా కాదంటే క్రిష్ రాసుకొన్న హిస్టరీలోనే రెండు కోణాలున్న పాత్ర ఉండొచ్చని మరికొద్దిమంది అంటున్నారు. అలా ఎలా వున్నప్పటికీ బాలయ్య రెండు పాత్రల్లో కనిపించడం ఖాయం. మరి అందులో వాస్తవమెంత అన్నది మాత్రం త్వరలోనే తేలనుంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సుమారు 100కోట్ల వ్యయంతో సినిమాని తెరకెక్కించబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.