Begin typing your search above and press return to search.
బాలయ్య ఆలోచన ఏ ఫలితం ఇస్తుందో!
By: Tupaki Desk | 17 Oct 2019 9:43 AM GMTతనకు బలమైన సెంటిమెంట్ గా భావించే సంక్రాంతిని బాలకృష్ణ ఈసారి ఛాయస్ గా పెట్టుకోవడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రూలర్ (ప్రచారంలో ఉన్న టైటిల్)ని డిసెంబర్ 20 నుంచి 25 మధ్యలో విడుదల చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా దెబ్బ తిన్న నేపధ్యంలో సెంటిమెంట్లను పక్కనబెట్టి సేఫ్ సీజన్ లో రిలీజ్ చేసి మంచి వసూళ్లు తెచ్చుకునేలా ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
దానికి అనుగుణంగా డిసెంబర్ ని టార్గెట్ చేసి షూటింగ్ త్వరగా పూర్తి చేస్తున్నారట. బిజినెస్ కూడా బాగా జరుగుతున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. రీజనబుల్ రేట్లకె నిర్మాత సి కళ్యాణ్ ఆఫర్స ఇవ్వడంతో కీలకమైన ఏరియాలకు డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఒకరకంగా చూసుకుంటే ఇదే మంచి నిర్ణయమని చెప్పొచ్చు. ఎందుకంటే పంతానికి పోయి సంక్రాంతి బరిలో దిగితే మహేష్ బాబు అల్లు అర్జున్ తో తలపడటం కష్టం. వాళ్ళకు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బలంగా ఉంటుంది.
అధిక శాతం అభిమానులనే నమ్ముకునే బాలయ్య సినిమాలు వాటికి ధీటుగా మెప్పించడం అంత ఈజీ కాదు. అందులోనూ దర్శకుడి బ్రాండ్ మీద ఈ సినిమా సేల్ కావడం లేదు. కేవలం బాలకృష్ణ అనే పేరు మీదే అమ్ముతున్నారు. సో డిసెంబర్ లో రావడం కరెక్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే రవితేజ డిస్కో రాజా 20ని లాక్ చేసుకున్నాడు. ఏదైనా మార్పు ఉంటే చెప్పలేం. అదే రోజు సాయి తేజ్ ప్రతిరోజు పండగే వస్తోంది. మరి బాలయ్య కూడా బరిలో ఫిక్స్ అయితే పోటీ రంజుగా ఉంటుందని వేరే చెప్పాలా