Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేశారా?

By:  Tupaki Desk   |   9 Aug 2017 10:25 PM IST
బాలయ్య ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేశారా?
X
తమిళంలో ఒకప్పుడు.. అబ్బా ఇప్పుడు కూడా.. అజిత్ అండ్ విజయ్ ఫ్యాన్స్ మధ్యన జరిగే గొడవలు మామూలుగా ఉండవ్. అలాంటి కల్చర్ నిధానంగా మన దగ్గరకు కూడా పాకేసింది. మన దగ్గర కూడా హీరోల అభిమానులు ఇతర హీరోలను వారి అభిమానులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాల్లో నానా బీభత్సాలు సృష్టిస్తున్నారు. వేరే ఎవరన్నా చిన్న హీరోలుకాని కమెడియన్లు కాని తమ హీరోల డైలాగులు కామెడీ కోసం చెబితే.. దానిపై ఇట్టే మండిపడుతున్నారు.

అదిగో ఇప్పుడు నందమూరి అభిమానులు కొందరు కమెడియన్ షకలక శంకర్ పై ఫైర్ అవుతున్నారు. 'పైసా వసూల్' సినిమా టీజర్ వచ్చినప్పటి నుండి.. అందులోని డైలాగులు బాగా పాపులర్ అవుతున్నాయ్. 'అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి' అంటూ స్లాంగులో బాలయ్య చెప్పే డైలాగులను అప్పుడే నెట్లో చాలామంది ప్యారడీలుగా కూడా వాడేస్తున్నారు. ఇక ఇదే డైలాగును తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ''ఆనందో బ్రహ్మ'' టీమ్ కూడా వాడుకుంటోంది. ఈ సినిమా కొత్త ప్రమోలో.. అన్నా రెండు బాల్కని టిక్కెట్లు కావాలి.. ఆనందో బ్రహ్మ సినిమా చూడాలి అంటూ షకలక శంకర్ వాయిస్ వస్తుంది. దానితో ఇప్పుడు తమ హీరో డైలాగును ఇంకా సినిమా రిలీజ్ కాకమునుపే ఇలా వాడేసుకుంటావా అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఇతగాడిపై ఫైర్ అవుతున్నారట.

ఇదే విషయమై ఒకవేళ పూరి జగన్ కాని బాలయ్య కాని ఏమన్నా హర్టయ్యారా అనే విషయం కనుక్కోవడానికి ఒక టివి ఛానల్ ప్రయత్నిస్తే.. అసలు అలాంటిదేం లేదని.. బాలయ్య అండ్ పూరి కూడా షకలక శంకర్ అలా వాడుకోవడం చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోందట. మరి వారి తరహాలోనే ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది.