Begin typing your search above and press return to search.

అప్పుడు బాలయ్య రియల్‌ పోలీస్‌ గా ఫీల్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   28 Aug 2019 1:30 AM GMT
అప్పుడు బాలయ్య రియల్‌ పోలీస్‌ గా ఫీల్‌ అయ్యాడు
X
ఏ హీరో అయినా.. హీరోయిన్‌ అయినా తనకు ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటిస్తేనే ఆ పాత్ర పండుతుంది. సినిమాలో ఆ పాత్ర కనిపించాలే తప్ప నటించిన హీరో కనిపించవద్దు. అలా జరిగినప్పుడే ఆ పాత్ర ప్రేక్షకులను రీచ్‌ అయినట్లు. అలా పాత్రలు రీచ్‌ అయ్యేందుకు హీరోలు హీరోయిన్స్‌ చాలా కష్టపడాల్సి ఉంటుంది. బాలకృష్ణ తాను పోషించే పాత్ర కోసం ఎంతగా వర్కౌట్‌ చేసేవాడో.. ఎంతగా బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్‌ చేసేవాడో తాజాగా దర్శకుడు బి గోపాల్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

బాలయ్య కెరీర్‌ లో నిలిచి పోయే సినిమాల్లో ఒకటి 'రౌడీ ఇన్‌ స్పెక్టర్‌'. విజయశాంతి హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రానికి బి గోపాల్‌ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలను తాజాగా ఇంటర్వ్యూలో గోపాల్‌ చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర తాళూకు అనుభవాలు మరియు కాస్ట్యూమ్స్‌ ను ఎక్కువగా వాడుతూ ఉంటాడు. ఈ సినిమా చేసే సమయంలో షూటింగ్‌ కు బాలకృష్ణ పోలీస్‌ గెటప్‌ తోనే ఇంటి వద్ద నుండి వచ్చేవాడు. ఇంటి వద్దే మేకప్‌ అయ్యి పోలీస్‌ యూనిఫార్మ్‌ వేసుకుని వచ్చేవాడు.

సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు కూడా తనకు తాను ఒక పోలీస్‌ గా ఫీల్‌ అయ్యేవాడు. రియల్‌ పోలీసులు ఎలా ఉంటారు.. వారి బాడీలాంగ్వేజ్‌ ఏంటీ అనే విషయాలను గమనించి వాటిని ఫాలో అయ్యేవాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు కూడా షూటింగ్‌ కోసం వాడిన ఒక పోలీస్‌ జీపులోనే ఆయన ఇంటి నుండి సెట్స్‌ కు రావడం.. సెట్స్‌ నుండి ఇంటికి వెళ్లడం చేసేవారు.

ఇంటికి జీపు పంపించాలంటూ ఆయన కండీషన్‌ పెట్టడంతో తాము షూటింగ్‌ ఉన్నన్ని రోజులు కూడా ఇంటికి జీపు పంపించి ఆయన్ను పోలీసు జీపులోనే పికప్‌ చేయించేవాళ్లం అన్నాడు. ఇక ఆయన డైలాగ్‌ డెలవరీలో కూడా రియల్‌ పోలీసు మాధిరిగా గాంభీర్యం కనిపించేది. అందుకోసం కూడా చాలా హోం వర్క్‌ చేశాడని గోపాల్‌ అన్నాడు. బాలకృష్ణ తో చేసిన ప్రతి సినిమా కూడా తనకు ఎప్పటికి గుర్తుండే జ్ఞాపకాలను మిగిల్చిందని బి గోపాల్‌ అన్నాడు.