Begin typing your search above and press return to search.

నాన్నగారిని గుర్తుకు చేసుకున్న బాలయ్య

By:  Tupaki Desk   |   17 May 2016 10:30 PM GMT
నాన్నగారిని గుర్తుకు చేసుకున్న బాలయ్య
X
బాలయ్యబాబుకు తన వందవ చిత్రం ఎంతటి ఇంపార్టెంటో అతనికి భాగా తెలుసు.తన తండ్రిగారైనటువంటి ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని మరీ ఓ చరిత్ర సృష్టించే దిశగా చారిత్రాత్మక చిత్రానికి ఉదయం ఐదుగంటలకు మేకప్ వేసుకుని ఆరుగంటలకు షూట్ కు చేరుకుంటున్నారు.అది కూడా మొరాకోలో.నిజానికి పరిశ్రమలో ఇపుడున్న వారిలో మోహన్ బాబు తప్ప హీరోల్లో ఇంకెవరు ఇంతలా త్వరగా మేల్కొని షూట్ కు అటెండ్ కారు.కాని బాలయ్య మాత్రం తాను చేస్తోన్న సినిమా ఎలాంటిదో తెలుసు కాబట్టి తన తండ్రిగారి మాదిరిగా భక్తి శ్రద్దలతో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా షూట్ కు అటెంట్ అవ్వడం విశేషం.

అటు డైరెక్టర్ క్రిష్ కూడా బాలయ్య వర్క్ సిన్సియారిటీ చూసి ఎంతగానో ఉప్పొంగిపోతున్నాడు.నిజానికి బాలయ్య విషయంలో డైరెక్టర్లు కొద్ది జాగ్రత్తగా ఉంటారు.నటరత్న తనకు నచ్చినట్లుగానే సినిమాల్లో యాక్ట్ చేస్తూ...ఆయా సినిమాల విషయంలో సీరియస్ గా తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు.

అయితే క్రిష్ చేస్తోన్న ఈ చారిత్రాత్మక చిత్రం విషయంలో డైరెక్టర్ మాటను జవదాటంగా తన ఇష్టదైవాన్ని కొలుస్తూనే ఈసినిమాను ఓ యాగంలా ఫీలై యూనిట్ తో కలిసి మెలిసి మసలడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది.ఇక సినిమా డైలాగ్స్ విషయంలో కూడా డెలాగ్ డెలివరీ ఎలా ఉండాలనేది క్రిష్ ను అడిగి మరీ ఓ సెషన్ ప్రాక్టీస్ చేయడానికి టైమ్ స్పెండ్ చేయడం బాలయ్యలో ఉన్న వర్క్ సిన్సియారిటీని మనకు గుర్తుకు తెస్తోంది.