Begin typing your search above and press return to search.
నాకా రిస్కా.. అంటున్న బాలయ్య
By: Tupaki Desk | 13 July 2016 6:51 AM GMTనందమూరి బాలకృష్ణ ఎన్నో కేరక్టర్స్.. మరెన్నో పాత్రల తర్వాత తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఎంచుకున్నారు. ఈ చారిత్రక చిత్రంలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. ఎక్కువగా యుద్ధ సన్నివేశాలే ఉంటాయి. అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కేవలం యుద్ధాలనే చిత్రీకరించారు. మొరాకోలో జరిగిన తొలి షెడ్యూల్.. హైద్రాబాద్ లో రెండో షెడ్యూల్.. ఇప్పుడు జార్జియాలో మూడో షెడ్యూల్.. అన్నింటిలోను యుద్ధాలనే తీస్తున్నాడు క్రిష్.
ఇప్పుడు జార్జియాలో జరుగుతున్న షూటింగ్ లో.. క్లైమాక్స్ ఎపిసోడ్ ల చిత్రీకరణ జరుగుతోంది. ఈ భాగంలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. వీటిలో రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయట. అందుకే స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవద్దని బాలకృష్ణకు సూచించాడట యాక్షన్ కొరియోగ్రాఫర్. దీనికి బాలయ్య ససేమిరా అని చెప్పడం యూనిట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. 'ఎంత రిస్కీ షాట్ అయినా చేసేయడమే.. బాడీ డబుల్స్ వద్దు' అని ఖరాఖండీగా చెప్పారట బాలయ్య. 'నేను ఎవడికెదురు వెళ్లినా వాడికే రిస్క్.. నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్' అంటూ తను డైలాగ్ చెప్పిన టైపులోనే యాక్షన్ కుమ్మేస్తున్నారు బాలయ్య.
లయన్ షూటింగ్ సమయంలో బాలయ్య గాయపడ్డారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయినా సరే ఇప్పుడు కూడా స్టంట్స్ చేసేందుకు బాలయ్య ఏ మాత్రం సందేహించడం లేదు. మనసులో పవర్ ఉంటే.. ఏజ్ పట్టించుకోవాల్సిన పని లేదని ప్రూవ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ.