Begin typing your search above and press return to search.

బాలయ్య రెండుసార్లు తొడగొడితే..

By:  Tupaki Desk   |   13 Jan 2017 9:18 AM GMT
బాలయ్య రెండుసార్లు తొడగొడితే..
X
బాలయ్య సినిమాలో ఒక్కసారైనా తొడగొట్టటం కామన్. ఆయన ఉగ్రరూపంలో తొడ గొట్టి.. పంచ్ డైలాగ్ చెబితే ఆ వ్యవహారమే వేరు. బాలయ్య తొడ గొడితే థియేటర్లో ఈలలు.. కేకలే కాదు.. బాక్స్ ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షమేనని చెబుతారు. అందుకే.. ఆయన సినిమాలో ఒకట్రెండు సందర్భాల్లో అయినా తొడగొట్టే ఏచిన్న అవకాశాన్ని మిస్ కారు.

అలాంటిది బాలయ్య రెండు తొడలు కొడితే ఎలా ఉంటుందన్న ముచ్చటను తీర్చేసింది శాతకర్ణి. తన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి వందో సినిమాకు.. శాతకర్ణి లాంటి సినిమాను ఎంచుకోవటం ఒక ఎత్తు అయితే.. ఇలాంటి సినిమాలో తొడగొట్టే ఛాన్స్ ఉంటుందా? అన్న డౌట్ పడ్డోళ్లు ఉన్నారు. అయితే.. క్రిష్ చాకచక్యంగా తొడ గొట్టించిన సీన్లు.. నందమూరి అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకుల్ని అలరించటం ఆసక్తికరమని చెప్పాలి.

ఒక్క తొడను కొడితే దిబ్బిడి.. దిబ్బిడి అయ్యే బాక్స్ ఫీస్.. శాతకర్ణిలో ఒక తొడ కొట్టే సీన్ ఒకసారి.. రెండు తొడలు ఒకేసారి కొట్టే సీన్ మరోసారి రావటం.. థియేటర్ మొత్తం హర్షద్వానాలతో మారు మోగిపోతోంది. బాలయ్య రెండు తొడల్ని కొట్టిన తర్వాత బాక్స్ ఫీస్ కలెక్షన్లు బద్ధలైపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/