Begin typing your search above and press return to search.
నాడు అభిమన్యుడు.. నేడు అఖండ
By: Tupaki Desk | 14 Dec 2021 1:30 AM GMTబాలక్రిష్ణ అఖండ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నందమూరి అభిమానుల కరవు పూర్తిగా తీర్చసింది. బాలయ్య వంద కోట్ల క్లబ్ లో చేరాలీ అంటూ గత కొన్నేళ్ళుగా ఫ్యాన్స్ తెగ గోల చేస్తున్నారు. మా హీరోకు ఆ స్టామినా ఉందని కూడా జబ్బలు చరచి గట్టిగా చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే బాలయ్య అనుకున్న ప్రాజెక్టులు ఏవీ హిట్ వైపుగా దూసుకురాలేదు. బోయపాటి మాత్రమే బాలయ్య కలను ఒక్క దెబ్బతో తీర్చేశాడు. ఫ్యాన్స్ కాలరెత్తుకుని తిరిగేలా చేశాడు. ఇక బాలయ్య అఖండ మూవీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీలో బాలయ్య అఖండ పాత్ర వేయడమే అతి పెద్ద విశేషం.
కమర్షియల్ ఫార్మెట్ ని నమ్ముకునే హీరోలు ఎవరూ ఇలాంటి సాహసం చేయరు. కానీ బాలయ్య బోయపాటి చెప్పిన కధకు ఓకే చెప్పేసి అఖండను ఆసాంతం ఆవాహన చేసుకున్నారు. ఇక ఈ మూవీ కి తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.
అయితే రీ రికార్డింగ్ కోసం తమన్ ఏకంగా నలభై రోజుల పాటు కష్టపడ్డాడు. ఆ టైమ్ లో బోయపాటి కూడా ఆయన పక్కన ఉండి అన్నీ చూసుకున్నాడు. అయితే ఇంటర్వెల్ కి వచ్చేసరికే తమన్ తన రీ రికార్డింగ్ తో సినిమాను ఎక్కడితో తీసుకుపోయాడు. అంటే క్లైమాక్స్ కి తగిన మూడ్ ని టెంపోని సగం సినిమాకే సెట్ చేసి పెట్టేశాడు అన్న మాట.
దాన్ని చూసిన బోయపాటి ఇంటర్వెల్ కే ఇంత ఎలివేషన్ అయితే క్లైమాక్స్ ఎలా అని మధన పడ్డారుట. అయినా సరే తమన్ ని ప్రొసీడ్ అంటూ ప్రోత్సహించాడు. అపుడే బోయపాటి మైండ్ లో సరి కొత్త ఆలోచనలు వచ్చాయట. భారతంలో అభిమన్యుడు తన రధ చక్రాలను పట్టుకుని యుద్ధం చేస్తాడు.
అలా బాలయ్య అఖండ పాత్రలో ఒక చక్రాన్ని ఆయన చేత పట్టించి ప్రత్యర్ధులను చీల్చి చెండాడే సీన్ ని క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా తమన్ మ్యూజిక్ కి మించి మరిన్ని ఎలివేషన్స్ క్రియేట్ చేసుకుంటూ బోయపాటి ఈ మూవీని పెంచుకుంటూ పోయారు. బోయపాటి అడగడంతోనే బాలయ్య కూడా ఈ చక్రం సీన్ చేశారు.
అయితే బాలయ్యకు ఇలా చక్రం పట్టి యుద్ధం చేయడం కొత్త కాదు, ఆయన దానవీర శూరకర్ణ చిత్రంలో అభిమన్యుడుగా చేశారు. అపుడు చక్రం పట్టుకుని యుద్ధం చేశారు. మళ్లీ 44 ఏళ్ళ తరువాత బాలయ్య చేత చక్రం పట్టించి ఫైట్ సీన్ పెట్టించిన డైరెక్టర్ గా బోయపాటిని చెప్పుకోవాలి. దాంతో కరడు కట్టిన ఫ్యాన్స్ నాటి అభిమన్యుడే ఈనాటి అఖండ అని చెప్పుకుని మురిసిపోతున్నారు.