Begin typing your search above and press return to search.
రియల్ స్టంట్స్ చేసే దమ్ముందా?
By: Tupaki Desk | 2 Jan 2016 7:05 AM GMTకొన్ని ప్రశ్నలు వేయాలంటే, కొన్ని ఛాలెంజ్ లు విసరాలంటే గుండెల్లో దమ్ముందాలి. నటసింహా బాలయ్యకు ఆ దమ్ముంది. అతడు ఓ రియల్ ఛాలెంజర్. ప్రత్యర్థులకే కాదు ఎవరి ముందైనా ఛాలెంజ్ విసిరే సత్తా ఉన్నా హీరో. ముఖ్యంగా అతడి సాహస విన్యాసాల గురించి అభిమానులు కథలు కథలుగా చెప్పుకుంటారు. అతడు ఓ రియల్ స్టంట్ మన్. యాక్షన్ సన్నివేశాల కోసం రోప్ లు కట్టుకోవడం, డూప్ లతో ఫైట్స్ చేయించడం వంటివి లేనేలేవు.
సింహా - లెజెండ్ అంతకంటే ముందు నుంచి బాలయ్యకు ఈ అలవాటుంది. ప్రమాదకర యాక్షన్ సీన్స్ ని అలవోకగా చేసేసిన ఘనుడాయన.. అంటూ పలువురు ముచ్చటించుకున్నారు. ఇప్పుడు ఆ సంగతినే బాలయ్య ఓ మారు ఓ టీవీ చానెల్ లైవ్ లోనూ గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ 99వ సినిమా డిక్టేటర్ ప్రమోషన్లో పాల్గొన్న ఆయన మరోసారి బోయపాటి లెజెండ్ గురించి ముచ్చటించారు. ఈ మూవీలో ఓ సన్నివేశంలో గ్లాసెస్ ను చిద్రం చేసుకుని గుర్రంతో బైటికి దూకించాల్సిన సీన్ ఉంది. ఈ సన్నివేశాన్ని దాదాపు 25 వేల మంది పబ్లిక్ చూస్తుండగానే నేను చేశాను. అలా చేసేందుకు ఏ హీరోకి అయినా దమ్ముండాలి. అలాంటి దమ్ము ఎవరికైనా ఉందా? అని సవాల్ విసిరారు.
యాక్షన్ సీన్స్ లో నటించేందుకు నాలో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. అప్పట్లో ఆ ప్రమాదకర సన్నివేశంలో చేస్తానంటే వద్దని వారించాడు బోయపాటి. గ్రాఫిక్స్ చేసేద్దాంలే అన్నాడు. కానీ నేనే వద్దని రియాలిటీ కోసం యత్నించా అని బాలయ్య చెప్పారు. ఇప్పుడు అంతకుమించి యాక్షన్ ట్రై చేశానని అన్నారు. డిక్టేటర్ లో యాక్షన్ అదిరిపోతుంది. ఈ మూవీ కోసం బల్గేరియా వెళ్లాం. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అవి సినిమాకే హైలైట్ గా ఉంటాయని చెప్పారు.