Begin typing your search above and press return to search.

శాతకర్ణిలో తొడ కొట్టే ఐడియా ఆయనదే

By:  Tupaki Desk   |   19 Jan 2017 5:10 AM GMT
శాతకర్ణిలో తొడ కొట్టే ఐడియా ఆయనదే
X
చారిత్రక సినిమాలో హీరో తొడ కొట్టటమా? అన్నది విమర్శలకు ప్రశ్న. బాలకృష్ణ మార్క్ అయిన తొడకొట్టటాన్ని శాతకర్ణి సినిమాలో.. కథలో ఇమిడిపోయేటట్లుగా చేశారు.. సూపర్ అన్నది అభిమానుల మాట. ఇలా ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో.. అసలు ఛారిత్రక కథాంశం ఉన్న చిత్రంలో హీరో చేత అలా మాస్ గా తొడ కొట్టించటం ఏమిటి? ఇంతకీ ఆ ఐడియా ఎవరిది? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.

బాలకృష్ణ సినిమాలో ఇప్పటివరకూ ఒక తొడ కొట్టటమే చూశారు. కానీ.. శాతకర్ణిలో రెండు కొట్టే సీన్ ఉంది. ఆ ఐడియా ఎలా వచ్చింది? ఎవరి కారణంగా ఆ సీనిమాలో వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పిందెవరూ లేరు.కానీ.. ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది.

సినిమాలో బాలకృష్ణ మార్క్ అయిన తొడ కొట్టే సీన్ ను పెట్టాలన్న ఆలోచన దర్శకుడు క్రిష్ దే. అయితే.. ఆ సినిమా రీరికార్డింగ్ సమయంలో ఒక తొడ కొట్టటంతో పాటు.. రెండు తొడలుకొట్టే సీన్ కూడా ఉంచితే బాగుంటుందని హీరో బాలకృష్ణకు అనిపించిందట. వెంటనే క్రిష్ కు ఫోన్ చేసి.. రెండు తొడలు కొట్టే సీన్ పెట్టాలని బాలకృష్ణే స్వయంగా చెప్పారట. దీంతో.. శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ రెండు తొడలు కొట్టే సీన్ వచ్చేసింది. అంటే.. శాతకర్ణి సినిమాలో ఆ సీన్ల వెనుక ఇద్దరు ఉన్నారన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/