Begin typing your search above and press return to search.

జై సింహా ఫస్ట్ లుక్ రెడీ

By:  Tupaki Desk   |   28 Oct 2017 10:53 AM IST
జై సింహా ఫస్ట్ లుక్ రెడీ
X

గౌతమి పుత్ర శాతకర్ణితో వంద చిత్రాల మైలురాయిని పూర్తి చేసుకున్న బాలకృష్ణ 101వ సినిమాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ చేశాడు. తేడా సింగ్ అంటూ బాలకృష్ణ తన మ్యానరిజంతో బాగానే ఆకట్టుకున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈసారి తనకు కలిసొచ్చిన సింహా టైటిల్ తో 102వ సినిమా మొదలెట్టారు.

తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య ప్రస్తుతం జై సింహా సినిమా చేస్తున్నాడు. ఇందులో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా నటాషా దోషి - హరిప్రియ కూడా బాలయ్యతో ఆడి పాడనున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నం - అరకు ప్రాంతాల్లో జరుగుతోంది. అరకులో బాలయ్య - హరిప్రియలపై ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. జై సింహా మూవీపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా మోషన్ పోస్టర్ ను నవంబరు 1న రిలీజ్ చేయనున్నారు. సి.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

జై సింహా షూటింగ్ ను జనవరి నాటికి పూర్తి చేసి సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి మూవీని కూడా సంక్రాంతికే తీసుకురావాలనే ఆలోచనలో ఆ చిత్ర యూనిట్ ఉంది.