Begin typing your search above and press return to search.
ఆ రెండు పార్టీలపై బాలయ్య అటాక్?
By: Tupaki Desk | 28 Oct 2017 7:42 AM GMTనందమూరి బాలకృష్ణ తన సినిమాల్లో తరచుగా పొలిటికల్ డైలాగులు పేల్చుతుంటాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలయ్య.. ప్రత్యర్థి పార్టీల మీద పరోక్షంగా పంచులేయడం మామూలే. ‘అధినాయకుడు’.. ‘లెజెండ్’ లాంటి సినిమాల్లో అలాంటి డైలాగులు చూడొచ్చు. ఇప్పుడు బాలయ్య చేస్తున్న కొత్త సినిమా ‘జై సింహా’లో కూడా ప్రత్యర్థి పార్టీల్ని బాలయ్య టార్గెట్ చేశాడేమో అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లు ఆ సంకేతాలే ఇస్తున్నాయి. ఈ కొత్త పోస్టర్లలో బాలయ్య కోర మీసంతో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. బహుశా బాలయ్య ఇందులో పోలీసేమో అనిపిస్తోంది.
రోడ్డు మీద ఒక పార్టీకి చెందిన వాళ్లందరూ ధర్నా చేస్తుంటే వాళ్ల మీద అటాక్ చేయడానికి లాఠీ పట్టుకుని ఉరుకుతున్నాడు బాలయ్య. ధర్నాలో కూర్చున్న వాళ్ల డ్రెస్సింగ్ - కండువాలు చూస్తే కాంగ్రెస్ పార్టీని తలపిస్తున్నాయి. ఇక ఓ వ్యక్తి పట్టుకున్న ప్లకార్డులో ‘వైజాగ్ లీడర్ రవిశంకర్ రెడ్డి జిందాబాద్’.. ‘పార్టీ షుడ్ గివ్ ఎంపీ టికెట్’ అని రాసి ఉన్నాయి. ఈ సెటప్ అదీ చూస్తే బాలయ్య కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్ని టార్గెట్ చేశాడేమో అనిపిస్తోంది. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులకు కూడా లోటుండదని తెలుస్తోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఎం.రత్నం ఈ చిత్రానికి కథ, మాటలు అందించాడు. నయనతార ఇందులో కథానాయిక.