Begin typing your search above and press return to search.

కళ్యాణ్‌ రామ్‌ ఆ కాంబోను సెట్‌ చేసేనా?

By:  Tupaki Desk   |   27 May 2020 8:30 AM GMT
కళ్యాణ్‌ రామ్‌ ఆ కాంబోను సెట్‌ చేసేనా?
X
ప్రస్తుతం టాలీవుడ్‌ తో పాటు అన్ని చోట్ల కూడా మల్టీస్టారర్‌ చిత్రాల ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రముఖ హీరోలు కలిసి నటిస్తు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్‌ లు కలిసి నటిస్తున్నారు. ఆచార్య చిత్రంలో చిరంజీవి ఇంకా చరణ్‌ లు కలిసి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా భారీ మల్టీస్టారర్స్‌ వస్తున్న నేపథ్యంలో త్వరలోనే నందమూరి వారి మల్టీస్టారర్‌ కూడా వస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ మరియు బాలకృష్ణల మల్టీస్టారర్‌ ల మూవీని కళ్యాణ్‌ రామ్‌ తీసుకు వస్తాడని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ తాము కూడా మనం వంటి సినిమాను చేయాలని నా కోరిక. కుటుంబ మల్టీస్టారర్‌ చిత్రం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎన్టీఆర్‌ మరియు బాలకృష్ణలతో సన్నిహితంగా ఉండే కళ్యాణ్‌ రామ్‌ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బాబాయి అబ్బాయిల మల్టీస్టారర్‌ చిత్రాన్ని తీసుకు వస్తాడని అనుకుంటున్నారు.

బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌ ల కోసం ఇప్పటికే కొందరు రచయితలు కథలు కూడా సిద్దం చేశారట. త్వరలోనే కళ్యాణ్‌ రామ్‌ ఇద్దరిని ఒప్పిస్తే బాగుండు అంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కళ్యాణ్‌ రామ్‌ ఈ కాంబోను వర్కౌట్‌ చేయగలడా అనేది చూడాలి. ఒక వేళ బాలయ్య.. ఎన్టీఆర్‌ ల కాంబోలో సినిమా వస్తే నందమూరి ఫ్యాన్స్‌ కు పెద్ద పండుగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.