Begin typing your search above and press return to search.
అభిమానులను ఎలా రెచ్చగొట్టాలో మాకు తెలుసు
By: Tupaki Desk | 10 Dec 2021 5:30 AM GMTబాలకృష్ణ కథానాయకుడిగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన 'అఖండ' సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. బాక్సాఫీస్ సాక్షిగా భారీ వసూళ్లను ముట్టజెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి వైజాగ్ లో జరిగిన గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ .. "భగవంతుడు నాకు ఇన్ని లక్షల మంది అభిమానులను ఇచ్చాడు .. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
అభిమానులు ఎప్పుడూ కూడా నా నుంచి ఏమీ ఆశించారు. నా విజయాలలో అభిమానులు పాలుపంచుకున్నారు. నా అపజయాలలోను నా వెన్నంటి నడిచారు.
ఎప్పటికప్పుడు నా వెన్నుతడుతూ నా అభిమానులు నన్ను ప్రోత్సహించారు. అలాగే కొత్తగా నేను ఏం చేయాలనుకున్నా కూడా ఒక ధైర్యాన్నిస్తూ వచ్చారు.
ఈ రోజున ఇక్కడ విజయోత్సవ వేడుక జరుపుకుంటున్నామంటే దానికి కారణం మీరే. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితుల్లో మీరంతా ఈ సినిమాకి ఇంతటి అఖండ విజయాన్ని అందించడం నిజంగా గొప్ప విషయం.
మీరంతా కూడా తండోప తడోపతండాలుగా .. తిరనాళ్లకి వచ్చినట్టుగా వచ్చారు. ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తాము అని మరోసారి నిరూపించారు. ఇది కేవలం మా విజయమే కాదు, చలనచిత్ర పరిశ్రమ విజయం.
ఈ సినిమాలో ఎన్నో కొత్త కొత్త పాత్రలు ఆవిష్కరించబడ్డాయి. 'లెజెండ్'లో విలన్ పాత్రను చేసిన జగపతిబాబు ఈ సినిమాలో పాజిటవ్ రోల్ చేశారు. ఇక శ్రీకాంత్ గారు ప్రతినాయకుడి పాత్ర చేయడం ఏమిటి? నితిన్ మెహతాగారికి కెమెరా అంటే ఏమిటో తెలియదు.
ఆయనను తీసుకొచ్చి చేయించడం ఏమిటి? ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే ఆమెకి టాలెంట్ తో పాటు అందం కూడా ఉంది. తన పాత్రను ఆమె చాలా హుందాగా చేశారు. పూర్ణగారు .. ధేష్ణ .. అందరూ కూడా ఎంతో అద్భుతంగా తమ పాత్రలను పోషించారు.
సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని గురించి మేము పెద్దగా చర్చించే వాళ్లం కాదు. ఒకసారి అనుకుని ఓకే చేసేసుకునేవాళ్లం. అభిమానులను ఎలా రెచ్చగొట్టాలో .. థియేటర్లలో ఎలా రచ్చ రచ్చచేయాలో .. దబిడిదిబిడి చేయాలో మాకు తెలుసు.
ఇటు టెక్నీషియన్స్ నుంచి అటు నటీనటుల నుంచి తనకి కావలసిన అవుట్ పుట్ ను తీసుకోగల సమర్ధుడైన దర్శకుడు మా బోయపాటి శ్రీనుగారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను ధైర్యంగా రిలీజ్ చేసిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు" అంటూ ముగించారు.