Begin typing your search above and press return to search.

బాలయ్యా.. ఇది బెస్ట్ అంతే

By:  Tupaki Desk   |   25 March 2016 4:48 AM GMT
బాలయ్యా.. ఇది బెస్ట్ అంతే
X
నందమూరి బాలకృష్ణను ఇప్పటిదాకా చాలా అవతారాల్లో చూశాం. ఆయన రకరకాల గెటప్పులేశారు. ఐతే గత కొన్నేళ్లో సింహా-లెజెండ్ సినిమాల్లో వేసిన గెటప్పులకు అద్భుతమైన స్పందన వచ్చింది. తనకు పర్ఫెక్టుగా సూటయ్యే స్టైలింగ్ - మేకప్ తో అభిమానుల్ని అలరించాడు బాలయ్య. ‘లెజెండ్’ తర్వాత బాలయ్య చేసిన లయన్.. డిక్టేటర్ సినిమాల్లో మళ్లీ మామూలుగానే కనిపించాడు బాలయ్య.

ఐతే తన తర్వాతి సినిమాకు మాత్రం బాలయ్య సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. గత కొన్ని రోజులుగా బాలయ్య గెటప్ అదీ చూస్తుంటే అభిమానులకు మతిపోతోంది. కొన్నేళ్ల కిందట బాలయ్య సరదాగా.. మీసాలు పెంచి.. వాటిని చెవి పక్కన జుట్టుతో కలిపి వెరైటీగా కనిపించాడు. ‘సింహా’లో అదే గెటప్ లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు అదే లుక్ లో కనిపిస్తూ కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్నాడు బాలయ్య. ముందు ఊరికే అలా సరదాగా అలా మీసం పెంచుతున్నాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు స్టైలింగ్ అదీ చేయించుకుని.. లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకున్నాడు బాలయ్య.

తనపై ఇండియా టుడే వెలువరించిన ప్రత్యేక సంచికను చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించిన సందర్భంగా బాలయ్య తన కొత్త లుక్ ను అభిమానులకు పరిచయం చేశాడు. ఇప్పటిదాకా బాలయ్యను రకరకాల లుక్స్ లో చూశాం కానీ.. ఇది ఆయనకు ‘ది బెస్ట్’ లుక్ అనడంలో సందేహం లేదు. మేకప్ ఏమీ వేయకుండానే బాలయ్య ఇలా ఉన్నాడంటే.. పాత్రలోకి మారాక ఇంకెలా ఉంటాడో?