Begin typing your search above and press return to search.

బాలయ్య మార్కెట్ కొలాప్స్ అవుతోందా?

By:  Tupaki Desk   |   30 Dec 2019 12:01 PM GMT
బాలయ్య మార్కెట్ కొలాప్స్ అవుతోందా?
X
నందమూరి బాలకృష్ణ హీరోగా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రూలర్' డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య-కెయస్ రవికుమార్ కాంబినేషన్లో గతంలో 'జైసింహా' అనే చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 'రూలర్' పై రిలీజుకు ముందు కొంత ఆసక్తి నెలకొంది. అయితే ప్రోమోస్ మాత్రం ఆ ఆసక్తిని తగ్గించాయి.

అయినప్పటికీ బాలయ్య మాస్ ఇమేజ్ కారణం ఈ సినిమాకు రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. సినిమా దాదాపు 15 కోట్ల రూపాయల డెఫిసిట్ లో రిలీజ్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ తర్వాత బ్యాడ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ పై అది తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి రోజు మాత్రం 'రూలర్' చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదు చేసింది. ఆ తర్వాత కలెక్షన్స్ లో డ్రాప్ కొనసాగింది. 'రూలర్' ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 కోట్ల రూపాయల షేర్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం చూస్తే ఇవి యాభై శాతం వసూళ్లు కూడా కాదు. సెకండ్ వీకెండ్ కూడా పూర్తయింది కాబట్టి వీక్ డేస్ లో భారీ ఇక కలెక్షన్స్ మెరుగయ్యే అవకాశం లేదు. దీంతో ఫుల్ రన్ లో పది కోట్ల షేర్ మార్క్ చేరుకునేది కూడా అనుమానమే అంటున్నారు.

ఇప్పటికే ఏడాదిలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలతో బాలయ్య దారుణ ఫలితం అందుకున్నాడు. ఈ ఏడాదిలో మూడో సినిమా కూడా ఇలా డిజాస్టర్ కావడం చూస్తుంటే బాలయ్య మార్కెట్ కు భారీగా దెబ్బపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం బాలయ్య తదుపరి చిత్రంపై పడే అవకాశం ఉందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. సినిమా సినిమాకు పతనమవుతున్న మార్కెట్ ను మెరుగుపరుచుకోవాలంటే బాలయ్య తన పంథా మార్చుకోక తప్పేలా లేదు.