Begin typing your search above and press return to search.

శాతకర్ణి.. సర్కార్ ను ఎందుకు కలిశాడు?

By:  Tupaki Desk   |   19 Oct 2016 9:31 AM GMT
శాతకర్ణి.. సర్కార్ ను ఎందుకు కలిశాడు?
X
ఈ రోజు సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యకర ఫొటో హల్ చల్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను కలిసిన ఫొటో అది. అది కూడా అమితాబ్ హైదరాబాద్ వస్తే అనుకోకుండా బాలయ్యను కలిసిన ఫొటో కాదది. బాలయ్యే ముంబయికి వెళ్లి అమితాబ్ కొత్త సినిమా ‘సర్కార్-3’ సెట్లో పెద్దాయన్ని కలిసి చర్చిస్తున్న ఫొటో అది. ‘సర్కార్-3’ షూటింగ్ మంగళవారమే ముంబయిలో మొదలైంది. ఆ రోజే బాలయ్య వెళ్లి ఆయన్ని కలిశారు. అమితాబ్ ఇందులో సర్కార్ గెటప్ లోనే కనిపిస్తున్నాడు.

బాలయ్య స్వయంగా ఈ సినిమా షూటింగుకి వెళ్లి అమితాబ్ ను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. బాలయ్య కెరీర్ ఆరంభంలో అమితాబ్ తో మంచి స్నేహమే ఉండేది. అప్పట్లో అమితాబ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్యతో బిగ్-బికి మంచి సంబంధాలుండేవి. కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య ఎలాంటి కలయిక జరగలేదు. ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ మాట్లాడింది లేదు. అమితాబ్ హైదరాబాద్ వచ్చినపుడు చిరంజీవి.. నాగార్జున లాంటి వాళ్లను కలిశాడు తప్ప బాలయ్యతో మీట్ అయిన సందర్భాలు కనిపించలేదు. మరి బాలయ్యే స్వయంగా ముంబయికి వెళ్లి అమితాబ్ ను ప్రత్యేకంగా కలవడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. కారణమేదైనా కానీ.. ఈ కలయిక మాత్రం జనాల్లో భలే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/