Begin typing your search above and press return to search.
బాలయ్య బ్యాక్ టు హోమ్
By: Tupaki Desk | 25 Sep 2016 6:13 AM GMTవందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని శరవేగంగా పూర్తి చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. గత కొన్ని వారాలుగా మధ్య ప్రదేశ్ లో షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట మొరాకో.. జార్జియా దేశాల్లోను.. హైద్రాబాద్ లో ఓ షిప్ సెట్ లోను యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్.. ఇప్పుడు ఫ్యామిలీ ఎపిసోడ్ కి సంబంధించి రాజప్రాసాదంలో ఉండే సీన్స్ ను దాదాపు ఫినిష్ చేశాడట. ఈ షెడ్యూల్ తో చాలావరకూ టాకీ పార్ట్ తోపాటు కొన్ని పాటల షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.
ఇప్పుడు మధ్య ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైద్రాబాద్ వచ్చిన బాలకృష్ణ.. వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరదలకు సంబంధించిన అప్ డేట్స్ ను తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సంపై ముందునుంచీ వాకబు చేస్తూనే ఉన్న ఆయన.. హైద్రాబాద్ వచ్చేసరికి తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి పలువురిని పిలిపించుకుని.. పరిస్థితులను సమీక్షించారు. అంతే కాదు.. ప్రభుత్వం తరఫున.. అభిమానుల తరఫున సహాయ కార్యక్రమాలు అందించేలా చర్యలు తీసుకోనున్నారట బాలయ్య.
'ప్రియమైన అభిమానులారా.. మనం అంతా ఏకమై హైద్రాబాద్-గుంటూరు.. ఇతర ప్రాంతాల్లో వర్ష బాధితులను ఆదుకోవాల్సిన సమయం ఇది. ఒక్కరిగానే మార్పు చూపిద్దాం. భద్రంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు బాలయ్య.