Begin typing your search above and press return to search.
రైతు పోరాటాలే బాలయ్యకు కన్ఫామ్!?
By: Tupaki Desk | 25 Feb 2016 5:20 AM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా ఏంటి? ఎవరు దర్శకత్వం వహించనున్నారు? నెల రోజులుగా ఈ ప్రశ్నలు పజిల్ లా అయిపోయాయి. అనేక మంది దర్శకుల పేర్లు, రకరకలా ఈక్వేషన్లు వినిపించాయి. అయితే.. ఈ ప్రశ్నలకు, పజిల్స్ కి ఇప్పుడు సమాధానం దొరికేసిందని చెప్పచ్చు. సెంచరీ మూవీని స్టార్ట్ చేసేందుకు బాలయ్య ఓ ఫైనల్ డెసిషన్ కి వచ్చేశారని తెలుస్తోంది.
బాలకృష్ణ తన ల్యాండ్ మార్క్ మూవీని డైరెక్షన్ చేసే అవకాశాన్ని.. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీకి ఇచ్చారని సమచారం. బాలయ్య ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త పాత్రని కృష్ణ వంశీ సృష్టించాడట. తన వందో సినిమాలో బాలయ్య రైతుగా నటించబోతున్నారు. రైతు అంటే సాగు వరకే పరిమితం అయ్యే పాత్ర కాదు.. ఇది పోరాటం చేసే రైతన్న రోల్ అంటున్నారు. పూర్తిగా విలేజ్ నేటివిటీతో సాగే ఈ స్టోరీలో.. రైతు నాయకుడిగా బాలయ్య పోరాటాలు కూడా చేస్తారని తెలుస్తోంది.
బాలయ్య-కృష్ణవంశీ కాంబినేషన్ లో రూపొందే మూవీ.. మే నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారట బాలయ్య. కానీ.. రైతు నాయకుడిగా పోరాటం అంటే ప్రభుత్వాలపై చేయాలి. కానీ ప్రస్తుతం బాలయ్యే ఏపీ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉన్నారు. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా కృష్ణవంశీ ఎలా కథ రాశాడా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.