Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరిలో ఎవరికి బాలయ్య ఛాన్స్?
By: Tupaki Desk | 8 Aug 2018 4:39 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో 2019 సంక్రాంతి బరిలో బాలయ్యను పందెంకోడిలా దించేందుకు శాయాశక్తులా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే తన తదుపరి సినిమా గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. నటసింహా ఇప్పటికే ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఒకరు వి.వి.వినాయక్ - ఇంకొకరు బోయపాటి శ్రీను. ఆ ఇద్దరిలో ఎవరి సినిమా ముందుగా మొదలవుతుంది? అసలు ఎన్నికల ముందు ఈ సినిమాలు పాజిబులేనా? అంటూ ఫిలింనగర్ లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఓవైపు ప్రధాని మోదీ ముందస్తు ఎన్నికల మంత్రం జపిస్తున్నారు. ఒకే దేశం.. ఒకేసారి లోక్ సభ ఎన్నికలు అన్న నినాదంతో ముందుకు కదులుతున్నారు. అందుకు తగ్గట్టు ఆయన మంత్రాంగం ఫలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే అప్పటికి బాలయ్య కొత్త సినిమా చేయడం అసంభవం. పోనీ ఎన్నికలు 2019 సమ్మర్ లో అని అనుకుంటే అప్పటికి ఎన్నికల కోడ్ ప్రభావం ఉంటుంది. అంటే బాలకృష్ణ నటించే తర్వాతి సినిమా చాలా ముందుగానే రిలీజ్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి చర్చ సాగుతుండగానే - వేరొక ఆసక్తికర సన్నివేశం నెలకొంది ఇక్కడ. ఒకవేళ బాలయ్య తర్వాతి సినిమా చేయాల్సి వస్తే బోయపాటి - వినాయక్ లలో ఎవరికి ముందుగా ఛాన్స్ ఉంటుంది? అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. ఆ ఇద్దరూ ఎవరికి వారు తమ స్క్రిప్టు విన్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బోయపాటి అదిరిపోయే పొలిటికల్ స్క్రిప్టుని రాస్తున్నారట. అందుకోసం పలు దఫాలుగా రచయితల బృందంతో కథా చర్చలు సాగిస్తున్నారు. ఇక వినాయక్ ... నందమూరి నటసింహం ఇమేజ్‌కి తగ్గ మాంచి మాస్ మసలా కథని వినిపిస్తారని చెబుతున్నారు. అయితే ఎవరేం చేసినా మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికల షెడ్యూల్ కు ముందే చేయాలి. వచ్చేస్తే ఇక వీళ్లు చేసేదేం ఉండదు. బాలయ్య పొలిటికల్ వార్ లో బిజీ అయిపోతారు. మరి ఈ పన్నాగంలో ఎవరి పావులు వేగంగా కదులుతాయో చూడాలి.