Begin typing your search above and press return to search.
బాలయ్య కోసం పోటీ గట్టిగానే ఉంది!
By: Tupaki Desk | 12 Feb 2023 8:00 AM GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల పరంగా స్పీడ్ పెంచాడని చెప్పాలి. ప్రతి సంవత్సరం కచ్చితంగా ఒకటి, రెండు సినిమాలు రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలకృష్ణ సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.
ఇక దీని తర్వాత బాలకృష్ణ 109వ సినిమా ఇప్పుడు ఎవరితో చేసే అవకాశం ఉందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం ఉన్న దర్శకులలో చూసుకుంటే ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణతో ఒక సినిమా ఫైనల్ అయ్యింది. అయితే సడెన్ గా పరశురాం దిల్ రాజు దగ్గరకి వచ్చి విజయ్ దేవరకొండతో గీతాగోవిందం 2 ఫైనల్ చేసుకున్నారు. దీనిని వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు.
అలాగే మల్లిడి వశిష్ట దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక మైథలాజికల్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో మూవీ చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ లైన్ లో ఉండగానే ప్రశాంత్ వర్మ చెప్పిన ఒక ఇంటరెస్టింగ్ స్టొరీకి ఒకే చెప్పారని టాక్.
ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా ఉన్నాడు. ఈ నేపధ్యంలోనే బాలయ్యకి ప్రశాంత్ స్టొరీ నేరేట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే వాల్తేర్ వీరయ్యతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ కూడా బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
అయితే బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ నలుగురు దర్శకులలో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. వీరు మాత్రమే కాకుండా మరల గోపీచంద్ మలినేని, శ్రీవాస్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయడానికి బాలయ్య ఒకే చెప్పారు.
అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయనేది వేచి చూడాలి. అయితే కచ్చితంగా ఈ అందరు దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేయడం మాత్రం పక్కా అని తెలుస్తుంది. కాకుంటే ఏది ముందుగా వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.