Begin typing your search above and press return to search.
బాలయ్యాస్ ఎన్టీఆర్.. ఆసక్తికర సంగతులు
By: Tupaki Desk | 11 Oct 2017 4:46 PM GMTతన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కొంచెం తాపీగానే కనిపించాడు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా కోసం ఏడాది నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తన కెరీర్లోనే ప్రత్యేకమైన.. కుటుంబానికే ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో బాలయ్య ఎక్కువ సమయమే తీసుకోవాలనుకున్నాడు. కానీ ఇంతలో రామ్ గోపాల్ వర్మ వచ్చి బాలయ్య అండ్ కోను ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. లక్ష్మీపార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయబోతున్నట్లు ప్రకటించి.. చకచకా అందుకు సన్నాహాలు పూర్తి చేసేస్తుండటంతో బాలయ్య బృందం త్వరపడాల్సిన అవసరమొచ్చింది. దీంతో వాళ్లు కూడా ఎన్టీఆర్ బయోపిక్ పై వడివడిగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా తేజను ఖరారు చేసి అతడికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు సమాచారం. బాలయ్య.. సాయి కొర్రపాటి.. విష్ణు ఇందుకూరిల భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. స్క్రిప్టు దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని ఖరారు చేశారట. మరోవైపు ఈ సినిమాను ఎలా మొదలుపెట్టాలి.. ఎలా ముగించాలనే విషయంలోనూ బాలయ్య అండ్ కో తుది నిర్ణయానికి వచ్చేసిందట. ఎన్టీఆర్ బాల్యం దగ్గర మొదలుపెట్టి.. ముఖ్యమంత్రి అయ్యాక నాదెండ్ల భాస్కరరావు తన నుంచి అక్రమంగా ముఖ్యమంత్రి పదవిని లాగేసుకుంటే.. దానిపై పోరాడి మళ్లీ సీఎం కుర్చీపై కూర్చోవడాన్ని పతాక సన్నివేశంగా చూపిస్తారట. ఆ తర్వాత ఆయన చనిపోయిన ఉదంతాన్ని క్లుప్తంగా చూపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు వర్మ వచ్చే ఫిబ్రవరిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదలవుతుందని అంటుంటే.. బాలయ్య చేయబోయే ఎన్టీఆర్ సినిమా టీజర్ ను జనవరిలోనే లాంచ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుండటం విశేషం.